బన్నీ హీరోయిన్ పరిస్థితేంటి..? ఇలా త‌యారైంది

  • IndiaGlitz, [Wednesday,April 15 2020]

నానితో మ‌జ్ను సినిమాలో జ‌త క‌ట్టిన మ‌ల‌యాళ ముద్దుగుమ్మ అను ఇమ్మాన్యుయేల్ ప్రారంభంలో మంచి అవ‌కాశాల‌నే అందిపుచ్చుకుంది. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో అజ్ఞాత‌వాసి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాల్లో న‌టించింది. అయితే త‌ర్వాత ఏమైందో ఏమో కానీ.. పోటీలో నిల‌వ‌లేక‌పోయింది. కొత్తగా వ‌చ్చిన హీరోయిన్స్ అవ‌కాశాల‌ను అందింపుచ్చుకుంటుంటే అను మాత్రం ఊసులోనే లేకుండా పోయింది. అయితే ఈ మ‌ధ్య బెల్లంకొండ శ్రీనివాస్‌, సంతోష్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో రూపొంద‌బోయే సినిమాలో న‌టిస్తుంద‌న్నారు.

ఏదైతేనేం అను ఇమ్మాన్యుయేల్‌కు మంచి అవ‌కాశం వ‌చ్చింద‌ని అంద‌రూ అనుకున్నారు. సినిమాలో న‌భా న‌టేశ్ కూడా ఉండ‌టంతో అను సెకండ్ హీరోయిన్ అని అంద‌రూ భావించారు. కానీ సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు అను ఇమ్మాన్యుయేల్ సెకండ్ హీరోయిన్‌గా కూడా న‌టించ‌డం లేద‌ట‌. సినిమాలో విల‌న్‌గా న‌టిస్తోన్న సోనూసూద్ భార్య పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని అంటున్నారు. స్లార్ హీరోలైన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, అల్లు అర్జున్‌ల‌తో న‌టించి కూడా అను ఇమ్మాన్యుయేల్ ఎందుకు ఈ పాత్ర ఒప్పుకుందో అర్థం కావ‌డం లేద‌ని కొంద‌రు అంటున్నారు. మ‌రి అను ఎందుకా పాత్ర ఒప్పుకుందో తెలియాలంటే విడుద‌ల వ‌ర‌కు ఆగాల్సిందే.

More News

"ఆదిత్యా థాక్రే.. సిగ్గుగా అనిపించట్లేదా..!?"

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో భారత దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉంటున్న వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ప్రధాని మోదీ లాక్‌డౌన్ కీలక ప్రకటన చేస్తారని..

దేశంలోని సంపన్నులకు షా విన్నపం.. ప్రజలకు భరోసా!

మే-03వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేసిన విషయం విదితమే. ఏప్రిల్-20 తర్వాత పరిస్థితులను బట్టి కొన్ని సడలింపులు ఉంటాయని..

హీరోయిన్ శ్రియ భర్తకు కరోనా లక్షణాలు..!

దక్షిణాది అందాల నటి.. ఒకప్పుడు టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన సీనియర్ నటి శ్రియ అందరికీ గుర్తుండే ఉంటుంది. పెళ్లయిన తర్వాత స్పెయిన్‌లోనే భర్తతో కలిసి ఉంటోంది.

మ‌హేశ్ కూడా ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు..?

సినిమా మాధ్య‌మంకు స‌మాంతరంగా ఎదుగుతుంది డిజిట‌ల్ మాధ్య‌మం. అమెజాన్‌, హాట్ స్టార్‌, నెట్‌ఫ్లిక్స్ వంటి టాప్ డిజిట‌ల్ మాధ్య‌మాలే కాకుండా మ‌రిన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్

బాల‌య్య 106 ప్లాన్ అదేనా?

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 106 చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. తొలి షెడ్యూల్ పూర్త‌యిన