అను హ్యాట్రిక్ ముచ్చట తీరేనా?

  • IndiaGlitz, [Tuesday,August 29 2017]

ప‌వ‌న్ క‌ళ్యాణ్, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌.. ఇలా వ‌రుస పెట్టి పెద్ద హీరోల చిత్రాల్లో హీరోయిన్‌గా ఎంపిక అవుతూ.. అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది కేర‌ళ కుట్టి అను ఎమ్మానియేల్‌. గ‌తేడాది నాని న‌టించిన హిట్ చిత్రం మ‌జ్నులో మెయిన్ హీరోయిన్‌గా న‌టించిన అను.. ఈ ఏడాది ప్రారంభంలో వ‌చ్చిన రాజ్ త‌రుణ్ చిత్రం కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌తో మ‌రో హిట్‌ని త‌న ఖాతాలో వేసుకుంది.

దీంతో స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న అనుకి అదృష్టం కూడా తోడ‌వ‌డంతో భారీ ఆఫ‌ర్లు వ‌రిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. గోపీచంద్‌తో అను జోడీ క‌ట్టిన ఆక్సిజ‌న్ చిత్రం ఎప్పుడో పూర్త‌యినా.. కాస్త ఆల‌స్యంగానైనా అక్టోబ‌ర్ 12న విడుద‌ల‌కి సిద్ధ‌మవుతోంది. ఇప్ప‌టికే రెండు విజ‌యాల‌ను సొంతం చేసుకున్న అనుకి ఆక్సిజ‌న్ కూడా హిట్ అయితే హ్యాట్రిక్ ముచ్చ‌ట తీరినట్టే. చూద్దాం.. ఏం జ‌రుగుతుందో?

More News

ఇప్పుడు బాలయ్య వంతు

ప్రముఖ తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ఇదివరకు మూడు తెలుగు చిత్రాలను తెరకెక్కించాడు. ప్రస్తుతం బాలకృష్ణతో నాలుగో చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.

నాని బాటలో నాని హీరోయిన్..

ఒకే హీరో లేదా హీరోయిన్ నటించిన రెండు సినిమాలు ఒకే రోజున విడుదలవడం అనేది వారి చేతుల్లో లేని విషయమే. అయినప్పటికీ ఒక్కోసారి అలా జరిగిపోతుంటుంది.

అభిమానులకు థాంక్స్ తప్ప ఇంకేం చెప్పగలను - అక్కినేని నాగార్జున

'విక్రమ్' నుంచి 'ఓం నమో వేంకటేశాయ' వరకు లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, భక్తి రస చిత్రాలతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న హీరో కింగ్ నాగార్జున.

వయసైన పాత్రలో శర్వా...

రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి ఇలా వరుస విజయాలను సాధిస్తున్న హీరో శర్వానంద్. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో మహానుభావుడు సినిమా చేస్తున్నాడు.

కుమారుడికి సాయం చేయాల్సిందిగా కోరిన సుహాసిని

దర్శకుడు మణిరత్నం, నటి సుహాసినిల కుమారుడు నందన్ ఇటలోని వెన్నిస్ లో దోపిడీకి గురయ్యాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయగానే వెంటనే సుహాసిని ట్విట్టర్ ద్వారా ఎవరైనా వెన్నిస్ ఎయిర్పోర్టు దగ్గరలో ఉంటే తన కుమారుడికి సహాయం చేయాల్సిందిగా కోరింది.