close
Choose your channels

త‌మ‌న్‌కు ఈ సారి కూడా ప్ల‌స్ అవుతుందా?

Sunday, July 1, 2018 • తెలుగు Comments

త‌మ‌న్‌కు ఈ సారి కూడా ప్ల‌స్ అవుతుందా?

బృందావ‌నం, దూకుడు, మ‌హానుభావుడు.. యువ సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ సంగీత‌మందించిన ఈ మూడు చిత్రాల‌కూ ఓ కామ‌న్ ఫ్యాక్ట‌ర్ ఉంది. అదేమిటంటే.. ఈ చిత్రాల‌న్నీ ద‌స‌రా సీజ‌న్‌లోనే విడుద‌లై మంచి విజ‌యం సాధించాయి. అలాగే కెరీర్‌కు   కీల‌క‌మైన స‌మ‌యంలో త‌మ‌న్‌కు విజ‌యాన్ని అందించాయి. ఇప్పుడు ఇదే ద‌స‌రా సీజ‌న్‌లో మ‌రో రెండు సినిమాల‌తో త‌మ‌న్ సంద‌డి చేయ‌నున్నారు. ఆ సినిమాలే.. అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌, అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని.

ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ రూపొందిస్తున్న అర‌వింద స‌మేత వీర రాఘ‌వ.. విజ‌య ద‌శ‌మి కానుక‌గా అక్టోబ‌ర్ 10న విడుద‌ల కానుండ‌గా.. శ్రీ‌ను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని కూడా ద‌స‌రా సీజ‌న్‌ను టార్గెట్ చేసుకుని రాబోతోంది. ఈ రెండు సినిమాల‌కు త‌మ‌న్ అందిస్తున్న సంగీతం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ కానుంద‌ని చిత్ర వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

ద‌స‌రా సీజ‌న్‌లో వ‌చ్చిన త‌మ‌న్ చిత్రాలు సింహ భాగం విజ‌యం సాధించిన నేప‌థ్యంలో ఈ సినిమాలు కూడా ఆ దిశ‌గా వెళ‌తాయేమో చూడాలి.

Get Breaking News Alerts From IndiaGlitz