లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో అనుప‌మ‌

  • IndiaGlitz, [Saturday,April 04 2020]

మ‌ల‌యాళ ముద్దుగుమ్మ‌..అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్ సరికొత్త అడుగు వేయనుందా? అంటే అవున‌నే స‌మాధానం తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ నుండి విన‌ప‌డుతుంది. ఇంత‌కూ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోనుందో తెలుసా? త‌్వ‌ర‌లోనే ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో న‌టించ‌నుంద‌ట‌. వివ‌రాల్లోకెళ్తే.. హ‌నుమాన్ చౌద‌రి అనే రైట‌ర్ త్వ‌ర‌లోనే ద‌ర్శ‌క‌త్వం చేయ‌బోతున్నాడు. ఓ లేడీ ఓరియెంటెడ్ క‌థ‌ను సిద్ధం చేసుకున్నాడు. అనుప‌మ‌ను క‌లిసి క‌థ‌ను చెబితే ఎక్కువ స‌మ‌యం తీసుకోకుండానే ఓకే చెప్పేసింద‌ట‌.

టాలీవుడ్‌లో క‌థా ప్రాధాన్య‌మున్న చిత్రాల‌కు ప్రాధాన్యత పెరుగుతుంది. కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌తో ద‌ర్శ‌కులు ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో టాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటే అనుష్క‌, స‌మంత‌లే క‌న‌ప‌డుతున్నారు. ఇలాంటి త‌రుణంలో అనుప‌మ ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం ఆమెకు క‌లిసొచ్చే విష‌య‌మే. పెద్ద‌గా అవ‌కాశాలు లేని త‌రుణంలో ఇలాంటి సినిమా ఛాన్స్ రావ‌డం మంచిదే. సినిమామ హిట్ అయితే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాల‌నుకునే వారికి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఓ హోప్ అవుతుంది.

More News

కరోనాపై పోరాటానికి బాలయ్య భారీ విరాళం.. చిరు థ్యాంక్స్

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధం ప్రకటించాయి. ఈ క్రమంలో పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తమ వంతుగా ప్రభుత్వాలకు సాయం చేస్తున్నారు.

బ్లాక్ బ‌స్ట‌ర్ ఫార్ములాతో ప్ర‌భాస్‌

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ త‌న 20 వ సినిమాను ఎప్పుడెప్పుడు పూర్తి చేద్దామా? అని ఎదురు చూస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ పీరియాడిక‌ల్ మూవీ గురించి

'మ‌హా స‌ముద్రం' అప్పుడైనా ఖ‌రార‌వుతుందా?

ఎంత క‌ష్ట‌ప‌డ్డా స‌రే! అవ‌గింజంత అదృష్టముండాల‌నే సామెత సినిమా రంగానికి ప‌క్కాగా సూట్ అవుతుంది. డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తిని చూస్తూ అది నిజ‌మేన‌ని అర్థ‌మ‌వుతుంది.

క‌రోనా క్రైసిస్ లో తెలుగు సినిమా పాత్రికేయుల‌కి అండ‌గా నిలిచిన 'తెలుగు ఫిల్మ్‌ జ‌ర్న‌లిస్ట్స్ అసోసియెష‌న్‌'

క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల ఏర్ప‌డిన క్రైసిస్ అంతా ఇంతా కాదు. ప్ర‌పంచం మెత్తం అత‌లాకుత‌ల‌మవుతుంది. ఎక్క‌డి వారు అక్క‌డే వుండిపోవాలి అంటూ లాక్‌డౌన్ ప్ర‌కటించిన త‌రువాత అంద‌రికి ఎం చేయాలో తెలియ‌ని

చిరుని ట్రాక్‌లో పెడుతున్న పూరి

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌..కరోనా వైర‌స్ ప్ర‌భావంతో ఇంటికే ప‌రిమిత‌మైయ్యాడు. రెండు, మూడు సంద‌ర్భాల్లో ఇంటిలో ఉండాలంటూ లేక‌పోతే మ‌రింత క‌ష్టాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుందంటూ