Anupama Parameswaran : స్కర్ట్‌కు ముడివేసి, నడుము చూపిస్తూ... పిచ్చేక్కిస్తోన్న అనుపమ

  • IndiaGlitz, [Tuesday,November 29 2022]

బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు తెలుగు సినిమాపై చాలా మంది మలయాళ బ్యూటీలు సందడి చేశారు. మధ్యలో ముంబై భామలు దండయాత్ర చేసినా మలయాళీ అందాలను మాత్రం తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే వున్నారు. ఇటీవల కేరళ ముద్దుగుమ్మల తాకిడి మళ్లీ పెరిగింది. ఇలాంటి వారిలో ఒకరు అనుపమా పరమేశ్వరన్. ప్రేమమ్ మూవీ సూపర్‌హిట్ కావడంతో ఆ దెబ్బకు సౌత్‌లో అనుపమ పేరు మారుమోగిపోయింది. తెలుగులోనూ ఆమెకు అవకాశాలు వెల్లువలా పోటెత్తాయి.

ప్రేమమ్‌తో సౌత్‌లో గుర్తింపు తెచ్చుకున్న అనుపమ:

త్రివిక్రమ్ నితిన్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘‘అ ఆ’’లో పదహారు అణాల తెలుగమ్మాయిలా సందడి చేశారు అనుపమ. తర్వాత ‘శతమానం భవతి’’, కృష్ణార్జున యుద్ధం, రాక్షసుడు వంటి సినిమాల్లో నటించింది. అయితే మధ్యలో కొన్ని సినిమాలు నిరాశ పరచడంతో అనుపమ పనైపోయిందని సినీ జనాలు పెదవి విరిచారు. ఈ నేపథ్యంలో నిఖిల్‌ సరసన చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘కార్తికేయ 2’’ సంచలన విజయం సాధించడంతో అనుపమకు మళ్లీ అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఆ వెంటనే కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న సినిమాలో అనుపమను హీరోయిన్‌గా ఎంపికైనట్లుగా ప్రచారం జరిగింది. తర్వాత డీజే టిల్లుకు సీక్వెల్‌లోనూ ఆమె నటిస్తున్నారు.

హాట్ ఫోటో షూట్‌లతో అనుపమ సందడి:

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే అనుపమ పరమేశ్వరన్ ఎప్పటికప్పుడు తన కొత్త సినిమా సంగతులు, షూటింగ్ వివరాలను అభిమానులతో పంచుకుంటూ వుంటారు. అలాగే తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెడుతూ వుంటారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చుక్కల కర్లీ హెయిర్‌తో ... స్కర్ట్‌కు ముడివేసి నడుము చూపిస్తూ రెచ్చిపోయింది ఈ కేరళ ముద్దుగుమ్మ. మరి మీరు కూడా ఓ లుక్కేయండి.

More News

S.S. Rajamouli : ‘హిట్ 2’... తప్పకుండా హిట్ అవుతుంది.. డౌటే లేదు: ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి

అడివి శేష్ హీరోగా న‌టించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘హిట్ 2 ది సెకండ్ కేస్’. నాని స‌మ‌ర్ప‌ణ‌లో

Galata Geethu : నాగార్జునతో గీతూ పాప... మళ్లీ హౌస్‌లోకి రీ ఎంట్రీనా, పింకీ పంచ్ పడిందిగా..!!

బిగ్‌బాస్ 6 తెలుగు ముగింపు దశకు వచ్చేసింది. విజయవంతంగా 13వ వారంలోకి ప్రవేశించింది.

Pushpa The Rise: రష్యాలో రిలీజ్ కానున్న పుష్ప .. విడుదల ఎప్పుడంటే..?

భారతీయ సినిమాలకు ఇప్పుడు అంతర్జాతీయంగా క్రేజ్ పెరుగుతోంది. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నదే అయినా..

రాజకీయాల వల్లే సినిమా విలువ తెలిసింది...అవినీతి లేనిది చిత్ర పరిశ్రమలోనే : చిరంజీవి వ్యాఖ్యలు

గోవాలో జరిగిన 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ముగింపు వేడుకలో మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు.

జీ 5లో ‘చుప్:  రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్‌’ చిత్రం 24 గంటల్లో 30 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్

మన ఇండియాలో ఎంట‌ర్‌టైన్‌మెంట్ రంగానికి ఓ ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంది.