అల‌క‌... అనుపమ వాకౌట్‌

  • IndiaGlitz, [Thursday,June 04 2020]

హీరో, హీరోయిన్స్ ముందు ఓ సినిమాకు ఓకే చెప్పేసి త‌ర్వాత ప్రాజెక్ట్ నుండి క్రియేటివ్ డిఫ‌రెనెసెస్ అని కార‌ణం చెప్పి సినిమా నుండి త‌ప్పుకుంటున్నారు. ఇప్పుడు టాలీవుడ్‌లో హీరోయిన్‌గా న‌టించే ఓ ముద్దుగుమ్మ అలాంటి ప‌ని చేసింద‌ని అంటున్నారు. ఇంత‌కు ఆమె ఎవ‌రో కాదు.. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. వివ‌రాల్లోకెళ్తే.. ఈ మ‌ధ్య ప్లాప్స్‌లో ఉన్న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర్‌కు అవ‌కాశాలే రావ‌డం లేదు. అదే స‌మ‌యంలో ఆమెకు కార్తికేయ 2 సినిమాలో న‌టించే అవ‌కాశం ద‌క్కింది. అంతా ఓకే అనుకున్నారు. అయితే చివ‌ర‌కు అనుప‌మ ప్రాజెక్ట్‌నుండి త‌ప్పుకుంటున్న‌ట్లు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు చెప్పేశార‌ట‌.

ఇంత‌కూ అనుప‌మ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకోవ‌డానికి చెబుతున్న కార‌ణం... త‌న పాత్ర‌కు త‌గిన ప్రాధాన్యం లేక‌పోవ‌డ‌మ‌ని. కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా నిఖిల్‌, చందు మొండేటి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుంది. లాక్ డౌన్ కార‌ణంగా సెట్స్‌పైకి వెళ్లాల్సిన ఈ సినిమా షూటింగ్ ఆగింది.

అనుపమ పరమేశ్వరన్ విషయానికి వస్తే సక్సెస్‌లే లేని ఈమెకు గత ఏడాది రాక్షసుడు రూపంలో తెలుగులో సక్సెస్ దక్కింది. ప్రస్తుతం ఈమె తెలుగులో సినిమాలు చేయడం లేదు. మలయాళం, తమిళంలో మాత్రమే సినిమాలు చేస్తున్నారు.

More News

'నారప్ప' లో సుందరమ్మ గా ప్రియమణి

సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా విక్టరీ ఇంటిపేరు గా చేసుకున్న వెంకటేష్ హీరోగా,

బాల‌య్య .. భారీ పార్టీ

జూన్ 10 నంద‌మూరి అభిమానులకు మ‌ర‌చిపోలేని రోజు. ఎందుక‌నో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్కర్లేదు. నందమూరి బాల‌కృష్ణ పుట్టిన‌రోజు.

పెళ్లి చేసుకోబోతున్న ప్ర‌భాస్ డైరెక్ట‌ర్‌

క‌రోనా టైమ్‌లో పెళ్లిళ్లు, ఫంక్ష‌న్స్ కొన్నాళ్ల పాటు ఆగాయి. అయితే దిల్‌రాజు, నిఖిల్ వంటి వారు క‌రోనా నిబంధ‌న‌ల మేర‌కు పెళ్లి చేసుకున్నారు.

మహిళ కమిషన్‌కు మీరా వ్యవహారం.. ఎన్టీఆర్‌కు తలనొప్పి!

అభిమానుల అత్యుత్సాహం టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనను వేధిస్తున్నారంటూ బాలీవుడ్ నటి మీరా చోప్రా

హగ్, కిస్, ఫైట్స్ లేకుండా షూటింగ్స్‌కు ఓకే..!

కరోనా నేపథ్యంలో సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు, థియేటర్స్ మూసివేయడంతో ఇండస్ట్రీకి ఏ రేంజ్‌లో నష్టం వాటిల్లిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.