'అమ్మ‌'గా అనుష్క‌..!

  • IndiaGlitz, [Tuesday,August 21 2018]

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, దివంగ‌త జ‌య‌ల‌లిత‌ను అంద‌రూ 'అమ్మ‌' అని పిలుస్తార‌నే విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆమె పై బ‌యోపిక్‌ల వెల్లువ కురుస్తోంది. తాజాగా సీనియ‌ర్ డైర‌క్ట‌ర్ భార‌తిరాజా కూడా త‌న‌వంతు ప్ర‌క‌టించేశారు. ఆదిత్య భ‌ర‌ద్వాజ్ నిర్మాణంలో ఆయ‌న ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్న‌ట్టు, ఇళ‌య‌రాజా సంగీతాన్ని స‌మ‌కూర్చ‌నున్న‌ట్టు ప్ర‌క‌ట‌న వెలువ‌డింది.ఇందులో న‌టించ‌డానికి అమ్మ పాత్ర కోసం అనుష్క‌ను, ఐశ్వ‌ర్య‌ను సంప్ర‌దిస్తున్నామ‌న్న‌ది ఆ వార్త సారాంశం. జ‌య‌ల‌లిత కూడా క‌న్న‌డిగ‌.

ఆమెకు క‌ర్ణాట‌క‌తో ఎంత‌టి సంబంధం ఉందో అంద‌రికీ తెలిసిందే. దానికి త‌గ్గ‌ట్టు క‌ర్ణాట‌క‌కు చెందిన అనుష్క‌, ఐశ్వ‌ర్య పేర్లు బ‌య‌టికి రావ‌డం ఒకింత కో ఇన్సిడెన్సే. అయినా ఇప్పుడు భార‌తిరాజా ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి వీరిద్ద‌రిలో ఎవ‌రు ముందుకొస్తారో వేచి చూడాలి. ఒక‌వేళ అనుష్క భార‌తిరాజా సినిమాకు ఓకే చెప్ప‌క‌పోయిన‌ప్ప‌టికీ విష్ణు ఇందూరి తెర‌కెక్కించే సినిమాకు సై అనే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి.

సో అదే నిజ‌మైతే విష్ణు ఇందూరి సినిమాలో ఎంజీఆర్ పాత్ర‌ను ఎవ‌రు పోషిస్తారు? అనేది తేలాల్సిన విష‌యం. అమ్మ‌గా న‌టించ‌డానికి ప‌లువురు న‌టీమ‌ణులు ఆస‌క్తి చూపుతున్న మాట వాస్త‌వ‌మే. అయితే ఎంజీఆర్‌గా స‌రిపోయే హీరోలు ఎంత‌మంది ఉన్నార‌నేది లెక్క‌పెట్టాల్సి ఉంది.

More News

శౌర్య కొత్త సినిమా 'గ‌ణ‌'

ఒక సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌గానే మ‌రో సినిమాను ప‌ట్టాల‌మీద‌కు ఎక్కించి బిజీ అవుతున్నాడు హీరో నాగ‌శౌర్య‌. తాజాగా ఆయ‌న న‌టించిన @న‌ర్త‌న‌శాల ఇంకా విడుద‌ల కాలేదు.

ధ‌న్య మ‌ల‌యాళం ఎంట్రీ

ధ‌న్య బాల‌కృష్ణ‌న్ పేరు విన‌గానే మ‌న‌కు సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు, ర‌న్ రాజా ర‌న్‌, నేనూ శైల‌జ వంటి ప‌లు సినిమాలు గుర్తుకొస్తాయి.

చైతు సినిమా పోస్ట్ పోన్ అవుతుందా?

అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా రూపొందుతోన్న చిత్రం 'శైల‌జారెడ్డి అల్లుడు'. 'మ‌హానుభావుడు' వంటి ఘ‌న‌విజ‌యం త‌రువాత మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ అత్త పాత్ర‌లో న‌టిస్తుండ‌గా...

50 కోట్ల క్ల‌బ్‌లో 'గీత గోవిందం'

ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లైన 'గీత గోవిందం' బాక్సాఫీస్ సంచ‌నాల‌కు కేంద్ర‌మైంది. అర్జున్‌రెడ్డి త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన చిత్రం కావ‌డంతో.. తొలి రోజున యూత్ థియేట‌ర్స్‌కు వ‌చ్చారు.

ర‌జనీకాంత్‌తో డ‌స్కీ బ్యూటీ

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా పిజ్జా, చిక్క‌డు దొర‌క‌డు ఫేమ్ కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలోఓ సిన‌మా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.