close
Choose your channels

‘ఆదిపురుష్‌’... అనుష్క క్లారిటీ..!

Tuesday, September 29, 2020 • తెలుగు Comments

‘ఆదిపురుష్‌’... అనుష్క క్లారిటీ..!

ప్యాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్..బాహుబ‌లి త‌ర్వాత ప్యాన్ ఇండియా స్టార్‌గా ప్ర‌భాస్ వ‌రుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అదులో భాగంగా బాలీవుడ్ ఓం రావుత్ ద‌ర్శ‌క‌త్వంలో పౌరాణికం రామాయ‌ణంను ఆదిపురుష్ పేరుతో తెర‌కెక్కించ‌నున్న‌ట్లు తెలిపారు. భారీ బ‌డ్జెట్‌తో ప్యాన్ ఇండియా మూవీగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాపై సోష‌ల్ మీడియాలో రోజుకొక వార్త వినిపిస్తుంది. ప్ర‌ధానంగా వినిస్తోన్న వార్త అస‌లు ఈ సినిమాలో సీత‌గా ఎవ‌రు న‌టిస్తారు? అనే అంశం. ప్ర‌భాస్ ప‌క్క‌న సీత‌గా ప‌లానా హీరోయిన్ న‌టిస్తుందంటూ ఒక్కొక్క హీరోయిన్ పేరు వినిపిస్తూనే ఉంది. ఈ లిస్టులో అనుష్క‌, కీర్తిసురేశ్, కియారా అద్వానీ పేర్లు ప్ర‌ముఖంగానే వినిపించాయి.

తాజాగా ఆదిపురుష్‌లో న‌టించే విష‌యం గురించి అనుష్క క్లారిటీ ఇచ్చారు. తాను ఆదిపురుష్‌లో న‌టించ‌డం లేద‌ని అనుష్క తెలిపారు. దీంతో ఆదిపురుష్‌లో అనుష్క న‌టించ‌నుందంటూ వ‌స్తున్న రూమ‌ర్స్‌కు క్లారిటీ ఇచ్చిన‌ట్లు అయ్యింది. సాహో విడుద‌ల త‌ర్వాత ‘రాధేశ్యామ్’ సెట్స్‌పై ఉంది. నాగ్ అశ్విన్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. అలాగే ‘ఆదిపురుష్’ చిత్రాన్ని కూడా ప్ర‌క‌టించారు. రూ.350 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఆదిపురుష్ రూపొంద‌నుంది. టీ సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది.

Get Breaking News Alerts From IndiaGlitz