‘ఆదిపురుష్’లో సీత.. క్లారిటీ ఇచ్చిన అనుష్క!

  • IndiaGlitz, [Thursday,October 01 2020]

బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్‌తో స్టార్ హీరోయిన్‌గా మంచి క్రేజ్‌ను అనుష్క సంపాదించుకుంది. ఇటీవలి కాలంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు ప్రాధాన్యతనిస్తున్న అనుష్క తాజా చిత్రం ‘నిశ్శ‌బ్దం’. ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో అక్టోబర్‌ 2న అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా విడుదలకాబోతోంది. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రాన్ని క్రితి ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ అసోసియేషన్‌లో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యానర్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా అనుష్క జూమ్‌ వీడియో ద్వారా మీడియాకు సినిమా విశేషాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా ‘ఆదిపురుష్’లో సీత పాత్ర చేస్తోందంటూ వస్తున్న వార్తలపై అనుష్క క్లారిటీ ఇచ్చింది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్, 3డీ చిత్రం ‘ఆదిపురుష్’. ఆదికావ్యం రామాయణం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా.. సీత పాత్రలో స్టార్ హీరోయిన్ అనుష్క నటిస్తోందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి తాజాగా అనుష్క ఫుల్‌స్టాప్ పెట్టేసింది. ఈ చిత్రంలో తాను నటిస్తున్నానంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని వెల్లడించింది. ఈ చిత్రంలో తన పాత్రపై రూమర్స్ ఎలా మొదలయ్యాయో కూడా తెలియదని పేర్కొంది. ‘ఆదిపురుష్’ చిత్రబృందం తనను అసలు సంప్రదించలేదని పేర్కొంది. అలాంటి గొప్ప పాత్రలకు సైన్ చేస్తే తానే అధికారికంగా ప్రకటిస్తానని.. రూమర్లను నమ్మవద్దని అనుష్క తెలిపింది.

ఇంకా అనుష్క మాట్లాడుతూ.. ‘‘13 సంవత్సరాల తర్వాత మాధవన్‌తో మళ్లీ వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. హాలీవుడ్ నటుడు మైకేల్ దగ్గర కొన్ని కొత్త విషయాలను నేర్చుకున్నాను. లాక్‌డౌన్‌లో‌ నా గురించి నేను తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఎన్నో సినిమాలు చూశాను. కథలెన్నో చదివాను. రెండు కొత్త చిత్రాలకు సైన్ చేశాను. త్వరలోనే వాటి గురించి తెలియజేస్తాను. సూపర్‌ నుంచి నిశ్శబ్దం వరకు చూసుకుంటే.. గొప్పవారెందరితోనో వర్క్ చేశాను. అదృష్టవంతురాలిగా భావిస్తున్నాను. అరుంధతి చిత్రం నా లైఫ్‌ని టర్న్‌ చేసింది. నా దర్శకులు, నిర్మాతలు నన్ను నమ్మి మంచి మంచి పాత్రలతో ప్రోత్సహించారు. ఇక అభిమానులు లేకుండా నా ఈ జర్నీ పూర్తవదు. ‘నిశ్శబ్దం’ కొత్త కాన్సెప్ట్ కనుక ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వస్తుందని భావిస్తున్నాం. అందరికీ సమ్‌థింగ్ డిఫరెంట్ మూవీ అనిపిస్తుంది. ప్రేక్షకుల రెస్పాన్స్ కోసం నేను కూడా వెయిట్‌ చేస్తున్నాను’’ అని తెలిపింది.

More News

కుమారులతో కలిసి అల్లు‘ స్టూడియోస్‌’ను నిర్మించనున్న అల్లు అరవింద్!

లెజెండరీ హాస్య నటుడు అల్లు రామలింగయ్య 99వ జయంతి నేడు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు.

కీ్ర్తి సురేశ్ తొలి సినిమా.. నిర్మాత‌ల మ‌ధ్య తొలి వివాదం

జాతీయ ఉత్త‌మ‌న‌టిగా ‘మ‌హాన‌టి’ చిత్రంతో గుర్తింపు సంపాదించుకున్న కీర్తిసురేశ్ తొలి చిత్రం నవీన్ విజయ్‌కృష్ణ హీరోగా రూపొందిన చిత్రం ‘ఐనా నువ్వంటే ఇష్టం’.

ఇట‌లీ బ‌య‌లుదేరిన ప్ర‌భాస్‌

బాహుబ‌లి’ త‌ర్వాత ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్‌.. ఇప్పుడు ఆ రేంజ్‌లోనే సినిమాలు చేస్తున్నారు.

సోషల్ మీడియాను దున్నేస్తున్న ‘నాది నక్కిలీసు గొలుసు’..

‘నాది నక్కిలీసు గొలుసు’ సాంగ్ వినని వారు ఎవరైనా ఉన్నారా? అని ఇప్పుడు అడగటం ఫూలిష్ నెస్ అవుతుందేమో..

ఇప్పటి వరకూ నమోదైన కేసుల్లో ఒక్క సెప్టెంబర్‌లోనే 40 శాతం కేసులు..

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే.. సెప్టెంబర్ నెలలో కరోనా మరింత తీవ్ర రూపం దాల్చింది.