close
Choose your channels

హిజ్రా పాత్రలో అనుష్క హీరో...

Tuesday, February 20, 2018 • తెలుగు Comments

ఇటీవ‌ల బాక్సాఫీస్ వ‌ద్ద స‌క్సెస్ సాధించిన చిత్రాల్లో అనుష్క టైటిల్ పాత్ర‌లో న‌టించిన `భాగ‌మ‌తి` ఒక‌టి. ఈ సినిమాలో అనుష్క జోడిగా న‌టించాడు మ‌ల‌యాళ హీరో ఉన్ని ముకుంద‌న్‌. ఈ యువ క‌థానాయ‌కుడు గ‌తంలో ఎన్టీఆర్‌, కొర‌టాల శివ `జ‌న‌తాగ్యారేజ్‌`లో నెగిటివ్ ట‌చ్ ఉన్న పాత్ర‌లో కూడా క‌నిపించారు మ‌రి.

ఇప్పుడు క‌థానాయ‌కుడు హిజ్రా పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు మ‌రి. వివ‌రాల్లోకెళ్తే.. మ‌ల‌యాళంలో రూపొందుతోన్న చిత్రం `చాణ‌క్య తంత్రం`. ఇందులో ఉన్ని ముకుంద‌న్ .. క‌రీనా అనే హిజ్రా పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. చిత్ర యూనిట్ దీని కోసం ఉన్ని ముకుంద‌న్ ఎలా త‌యారైయ్యాడ‌నే వీడియో కూడా విడుద‌ల చేసింది.