అనుష్క ప్రేమించింది అత‌న్నే!

  • IndiaGlitz, [Thursday,November 09 2017]

త‌ను ప్రేమించిన వ్య‌క్తి గురించి స్వీటీ అనుష్క బాహాటంగానే చెప్పింది. ఒకానొక స‌మ‌యంలో ఆమె అత‌ని ప్రేమ‌లో పీక‌ల్లోతు కూరుకుపోయిన విష‌యాన్ని కూడా ప్ర‌స్తావించింది. ఇటీవ‌ల 'భాగ‌మ‌తి' ఫ‌స్ట్ లుక్‌తో అల‌రించిన స్వీటీ త‌న ప్రేమాయ‌ణాన్ని గురించి చాలా స్ప‌ష్టంగా చెప్పింది.

"అత‌నంటే నాకు చాలా ఇష్టం. ఒకానొక స‌మ‌యంలో అత‌నితో పీక‌ల్లోతు ప్రేమ‌లో ప‌డ్డాను. ఇంకా కూడా అత‌నిపై నా ఇష్టం కొన‌సాగుతోంది. అత‌ను మ‌రెవ‌రో కాదు.. రాహుల్ ద్ర‌విడ్‌. నా చిన్న‌త‌నం నుంచి అత‌నంటే పిచ్చి. కేవ‌లం అత‌ని కోస‌మే క్రికెట్ చూసేదాన్ని" అని త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను వ్య‌క్తం చేసింది.

క్రికెట్ అంటే సినిమా తార‌ల‌కు అభిమానం ఇప్ప‌టిది కాదు. అయితే అనుష్క మాత్రం ఇలా త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను, త‌న అభిమాన క్రికెట్ వీరుడిని, అత‌నిపై ప్రేమ‌ను వ్య‌క్తం చేయ‌డం ఇదే తొలిసారి. క్రికెట‌ర్ విష‌యం స‌రే.. నిజ జీవితంలో చేసుకోబోయే వ్య‌క్తి గురించి ఎప్పుడు చెబుతుందా అని వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నాం అంటూ సోష‌ల్ మీడియాలో అనుష్క‌ను ఉద్దేశించి ప‌లువురు కామెంట్లు చేస్తున్నారు.

More News

హిట్ డైరెక్ట‌ర్‌తో అనీషా....

గోపాల గోపాల‌, ర‌న్ వంటి చిత్రాల్లో మెప్పించిన హీరోయిన్ అనీషా అంబ్రోస్‌..హీరోయిన్‌గా మ‌రో చిత్రంలో ఎంపికైంది.

మారుతి కొత్త ప్లాన్‌...

డైరెక్ట‌ర్ మారుతి ద‌ర్శ‌కత్వం వైపే కాకుండా నిర్మాణ రంగంలో కూడా త‌న‌దైన రీతిలో రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే. మారుతి టాకీస్ అనే బ్యాన‌ర్‌ను స్థాపించి, త‌న శిష్యుల‌కు ద‌ర్శ‌కులుగా అవ‌కాశం ఇస్తూ వ‌స్తున్నాడు.

మూడు సినిమాలతో రాజీవ్ సాలూరి

సంగీత దర్శకుడు  కోటి కొడుకుగా చిత్ర పరిశ్రమలొకి వచ్చాడు .. చెసింది మూడు నాలుగు సినిమాలె అయినా నటుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నాడు రాజీవ్ సాలూరి.

నాని డైరెక్ట‌ర్‌తో మెగా హీరో...

కెరీర్ ప్రారంభం నుండి విల‌క్ష‌ణ‌మైన సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపుతున్న మెగా హీరో వ‌రుణ్ తేజ్‌. ఈ పొడుగు హీరో ప్ర‌స్తుతం వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

హాలీవుడ్ చిత్రంలో...

శాండిల్‌వుడ్‌లో స్టార్ ఇమేజ్ ఉన్న సుదీప్ ఇటు తెలుగు, త‌మిళ చిత్రాల‌తో పాటు అటు బాలీవుడ్ చిత్రాల్లో కూడా న‌టించి ప్రేక్ష‌కులందిర‌కీ ద‌గ్గ‌ర‌య్యాడు. ఈ హీరో ఇప్పుడు హాలీవుడ్ సినిమాలో కూడా క‌నిపించ‌బోతున్నాడు.