అనుష్క 'నిశ్శబ్దం' ప్రచార చిత్రం  విడుదల

  • IndiaGlitz, [Saturday,July 20 2019]

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ సంయుక్తంగా నిర్మిస్తున్న తొలి క్రాస్ ఓవ‌ర్ చిత్రం ''నిశ్శబ్దం'. టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ న‌టీన‌టుల‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమా రూపొందుతోంది. సుప్రసిద్ధ నాయిక అనుష్క శెట్టి న‌టిగా 14 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ''నిశ్శబ్దం'' టైటిల్ ప్రచార చిత్రం విడుదల చేయ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని చిత్ర నిర్మాత‌లు తెలియ‌చేసారు.

అమెరికా లోని సియాటల్ లో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా దాదాపు పూర్తయింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ అంతా యునైటెడ్ స్టేట్స్ లోనే జ‌ర‌గ‌నుంది. చిత్ర నిర్మాత‌లు టి.జి.విశ్వ‌ప్ర‌సాద్, వివేక్ కూచిభోట్ల‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్, ఇంగ్లీషు, హిందీ & మ‌ల‌యాళం ఈ 5 భాష‌ల్లో ఈ సంవ‌త్స‌రం చివ‌రిలో భారీ స్ధాయిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

అనుష్క శెట్టి, ఆర్.మాధ‌వ‌న్, అంజ‌లి, మైఖేల్ మ్యాడ‌స‌న్, షాలిని పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస అవ‌స‌రాల‌, హంట‌ర్ ఓ హ‌రో మెయిన్ రోల్స్ పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం - గోపీ సుంద‌ర్, ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి, ఆర్ట్ - చాడ్ రాప్టోర్, స్టైలీష్ట్ - నీర‌జ కోన‌, స్టంట్స్ - ఆలెక్స్ టెర్జీఫ్, సినిమాటోగ్ర‌ఫీ - షానియ‌ల్ డియో, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ - కోన వెంక‌ట్, స్టోరీ & డైరెక్ష‌న్ - హేమంత్ మ‌ధుక‌ర్; సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల; నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్

More News

మాజీ సీఎం షీలా దీక్షిత్ కన్నుమూత

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌(81) తుదిశ్వాస విడిచారు.

సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రం 'రణరంగం'  లోని 'కన్నుకొట్టి'  పాట విడుదల

యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శి ని ల కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో

'ఉత్త‌ర' ట్రైల‌ర్ లాంచ్

లైవ్ ఇన్ సి క్రియేషన్స్, గంగోత్రి ఆర్ట్  క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన మూవీ ‘ఉత్తర’.  శ్రీరామ్, కారుణ్య కత్రేన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈమూవీ కి దర్శకుడు  తిరుపతి యస్ ఆర్.

ప్రేక్ష‌కుడు ద‌ర్శ‌క‌త్వం లో ఒకే టికెట్ పై రెండు చిత్రాలు.. 

ప్ర‌స్తుతం టికెట్ కొనుక్కుని వ‌చ్చే ప్రేక్ష‌కుడు ఆ సినిమా తీసిన ద‌ర్శ‌కుడు క‌న్నా తెలివిగా ఆలోచిస్తున్నాడు.

జబర్దస్త్ వినోదినిపై దాడి.. అసలేం జరిగింది!

తెరపై వినోదంతో నవ్వులు పంచే నటీనటుల వ్యక్తి గత జీవితంలో మాత్రం రెగ్యులర్ కష్టాలు తప్పటం లేదు.