close
Choose your channels

అనుష్క స‌మ‌స్య తీరింది

Wednesday, May 15, 2019 • తెలుగు Comments

అనుష్క స‌మ‌స్య తీరింది

దాదాపు ఏడాది పైగా గ్యాప్ తీసుకున్న అనుష్క శెట్టి ఇప్పుడు మ‌ళ్లీ యాక్టింగ్‌పై ఫోక‌స్ పెట్టింది. మాధ‌వ‌న్‌తో క‌లిసి అనుష్క `సైలెన్స్‌` అనే థ్రిల్ల‌ర్‌లో న‌టించ‌డానికి ఓకే అంది. ఫిబ్ర‌వ‌రిలో షూటింగ్ చేద్దామ‌నుకున్నారు. కానీ.. అస‌లు స‌మ‌స్య వీసా రూపంలో వ‌చ్చి ప‌డింది. అనుష్క‌కు వీసా లేదు. ఆమె ఓ వ‌న్ వీసా కోసం ఫిబ్ర‌వ‌రిలో అప్లై చేసుకుంది. వీసా రావ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టింది. రీసెంట్‌గా అనుష్క‌కు వీసా వ‌చ్చింది. మే నెలాఖ‌రున సైలైన్స్ ఎంటైర్ యూనిట్ అమెరికా వెళుతున్నారు. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ప్ర‌ముఖ ర‌చ‌యిత కోన వెంక‌ట్ స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. 

Get Breaking News Alerts From IndiaGlitz