మ‌రోసారి ప్ర‌భాస్ గురించి చెప్పిన అనుష్క ఏమందో తెలుసా?

  • IndiaGlitz, [Sunday,March 15 2020]

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మ‌ధ్య ప్రేమ వ్య‌వ‌హారం ఉంద‌ని, వారు పెళ్లి చేసుకుంటార‌ని ప‌లు సంద‌ర్భాల్లో ప‌లు ర‌కాలుగా వార్త‌లు వినిపించాయి. రీసెంట్ ఇంట‌ర్వ్యూలో ప్ర‌భాస్‌తో అనుబంధం గురించి అనుష్క‌ను అడిగితే ఆమె ఏమాత్రం విష‌యాన్ని దాచుకోకుండా చెప్పేసింది. ‘‘నేను, ప్ర‌భాస్ ఒకే మ‌న‌స్త‌త్వం ఉన్న వ్య‌క్తులం. ఇద్ద‌రం ‘బిల్’లా, ‘మిర్చి’, ‘బాహుబలి’ చిత్రాల్లో క‌లిసి న‌టించాం. ఇద్ద‌రికీ పెళ్లి కాలేదు. కాబ‌ట్టి ఇద్ద‌రి మ‌ధ్య ఏదో ఉంద‌ని వార్త‌లు వ‌చ్చేస్తున్నాయి. నిజానికి నాకు ప్ర‌భాస్ 3ఎ.ఎం. ఫ్రెండ్‌. అంటే ఏ స‌మ‌యంలోనైనా నేను త‌న‌తో మాట్లాడేంత అనుబంధం ఉంది. ఇద్ద‌రి మ‌ధ్య ఏదైనా ఉంటే ఎప్పుడో చెప్పేసేవాళ్లం. ఇద్ద‌రం ఎమోష‌న్స్‌ని దాచుకోలేం’’  అన్నారు.

ఇదే సంద‌ర్భంలో ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర రావు త‌న‌యుడు, ద‌ర్శ‌కుడు.. ప్ర‌కాష్ కోవెల‌మూడిని పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై అనుష్క స్పందిస్తూ ‘‘బ‌బ్లూ నాకు మంచి స్నేహితుడు. అత‌నితో పెళ్లి అని ఎలా రాసేస్తారు? అంత‌కు ముందు వేరే హీరోలు, క్రికెట‌ర్ల‌తో పెళ్లి అని రాసేశారు. నేను పెళ్లి చేసుకుంటే క‌చ్చితంగా అంద‌రికీ చెబుతా’’ అన్నారు అనుష్క‌. ఈమె న‌టించిన ‘నిశ్శ‌బ్దం’ చిత్రం ఏప్రిల్ 2న విడుద‌ల కానుంది. మ‌రి క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా సినిమా విడుద‌ల వాయిదా ప‌డుతుందేమో చూడాలి. 

More News

విశ్వ‌క్ సేన్‌ని ఆ సినిమాలో తీసేశారు.. త‌ర్వాత ఏమైందో తెలుసా?

ఇటీవ‌ల విడుద‌లైన ‘హిట్‌’తో హిట్ అందుకున్న హీరో విశ్వ‌క్‌సేన్‌. ఈ యంగ్ హీరో కెరీర్ సాఫీగా ఏం సాగిపోలేదు.

కలకలం.. గోల్కొండ టోలీచౌక్‌లో కరోనా అనుమానిత కేసు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ భారీన పడి వందల సంఖ్యలో చనిపోగా..

చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోన్న `ఈ కథలో పాత్రలు కల్పితం`

పవన్‌ తేజ్‌ కొణిదెల హీరోగా పరిచయం చేస్తూ మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌ పై అభిరామ్‌ ఎం. దర్శకత్వంలో

అభిమానులారా.. నా ఇంటికి రాకండి : బిగ్‌బీ

కరోనా వైరస్ పేరు వింటేనే ప్రపంచం వణికిపోతోంది.. చైనాలోని వూహాన్‌లో వచ్చిన ఈ వైరస్ ఖండాలను దాటేసి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది.

అలియా భట్‌కు ‘RRR’ యూనిట్ స్పెషల్ బర్త్‌డే విషెస్

ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘RRR’. ఇప్పటికే భారీ చిత్రాలతో ఇండియన్ రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన జక్కన్న