close
Choose your channels

గేమ్ షో లో క‌న్నీళ్లు పెట్టుకున్న అనుష్క‌

Monday, March 23, 2020 • తెలుగు Comments

గేష్ షో లో క‌న్నీళ్లు పెట్టుకున్న అనుష్క‌

నిశ్శ‌బ్దం సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా అనుష్క రీసెంట్‌గా ఓ గేమ్ షోలో పాల్గొన్నారు. ఇందులో ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పారు స్వీటీ. అందులో భాగంగా సినిమాల్లో యాక్టింగ్‌, ప్ర‌భాస్‌తో స్నేహం వీటిలో దేన్నైనా మానేయ‌మంటే దేన్ని మానేస్తారు? అని అడిగితే ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా యాక్టింగ్ మానేస్తాన‌ని స్వీటీ ఆన్స‌ర్ ఇచ్చింది. సినిమాల్లో న‌టించ‌డానికి స్నేహాన్ని వ‌దులుకోలేన‌ని అనుష్క చెప్పారు. అలాగే పూరి, రాజ‌మౌళిల‌లో ఎవ‌రు ఇష్ట‌మైన ద‌ర్శ‌కుడు అని ప్ర‌శ్నిస్తే.. పూరి జ‌గ‌న్నాథ్ అని అనుష్క చెప్పారు. సూప‌ర్ చిత్రంలో పూరి అవ‌కాశం ఇవ్వ‌డం వ‌ల్లే రాజ‌మౌళిని క‌లుసుకోగ‌లిగాన‌ని ఆమె అన్నారు. ఒక‌వేళ టూర్ వెళ్లాల్సి వ‌స్తే ఎవ‌రితో వెళ‌తారు?  రాజ‌మౌళి ఫ్యామిలీతోనా?  నాగార్జున ఫ్యామిలీతోనా అని అడ‌గ్గా.. రాజ‌మౌళి ఫ్యామిలీతో అని అనుష్క స‌మాధాన‌మిచ్చారు.

15 ఏళ్ల క్రితం నేను గొప్ప డాన్స‌ర్‌ని కాను. సూప‌ర్ సినిమాలో అక్క‌డ‌బ‌క్క‌డ .. సాంగ్ చేస్తున్న‌ప్పుడు రిహార్స‌ల్ చేస్తున్న స‌మ‌యంలో డాన్స్ ఎలా చేయాలో తెలిసేది కాదు. నేను ఏడ్చాను కూడా. ప‌దిరోజులు స‌మ‌యం తీసుకుని రిహార్స‌ల్ చేసి చేద్దాం. ఏం కాదు.. అని యూనిట్ చెప్పారు. త‌న‌కు హీరోయిన్‌గా అవ‌కాశం ఇచ్చిన పూరి, నాగార్జున‌ల‌కు థాంక్స్ చెప్పిన అనుష్క‌, కోడిరామ‌కృష్ణ‌ని త‌లుచుకుని ఎమోష‌న‌ల్‌గా క‌న్నీళ్ల ప‌ర్యంత‌మ‌య్యారు.

Get Breaking News Alerts From IndiaGlitz