అనుష్కకి విలన్ గా..

  • IndiaGlitz, [Friday,January 19 2018]

అరుంధ‌తి, బాహుబ‌లి చిత్రాల త‌రువాత మ‌రోసారి అభిన‌యానికి అవ‌కాశ‌మున్న పాత్ర‌లో అనుష్క న‌టిస్తున్న చిత్రం భాగ‌మ‌తి. పిల్ల జ‌మీందార్ ఫేమ్ అశోక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని యువి క్రియేష‌న్స్ సంస్థ నిర్మించింది. తెలుగుతో పాటు త‌మిళ్‌, మ‌ల‌యాళం భాష‌ల్లో కూడా ఈ సినిమా విడుద‌ల కాబోతోంది. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెకెక్కిన‌ ఈ సినిమాలో.. ఉన్ని ముకుంద‌న్‌, జ‌య‌రామ్‌, ఆశా శ‌ర‌త్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.

అలాగే ఆది పినిశెట్టి కూడా ఓ ముఖ్య‌మైన పాత్ర చేశాడు. అయితే.. ట్రైల‌ర్‌లో త‌న‌ని ఎక్క‌డా చూప‌క‌పోవ‌డానికి కార‌ణం.. విల‌న్‌గా త‌ను చేసిన పాత్ర తాలుకూ ఓ డిఫ‌రెంట్ గెట‌ప్ ఉండ‌డ‌మేన‌ని తెలిసింది. స‌రైనోడు, అజ్ఞాత‌వాసి చిత్రాల్లో విల‌న్ పాత్ర‌ల్లో మెప్పించిన ఆదికి ఈ సినిమా.. గ‌త చిత్రాల‌కి మించిన గుర్తింపు తీసుకువ‌స్తుంద‌ని చిత్ర వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. జ‌న‌వ‌రి 26న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

More News

రామ్ చరణ్ కి అత్త కాదట

బుల్లితెర సంచలనం అనసూయ..వెండితెర పైనా సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

రెగ్యులర్‌ షూటింగ్‌లో రామ్‌చరణ్‌, బోయపాటి భారీ చిత్రం

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో  కొత్త చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ శుక్రవారం హైదరాబాద్‌లో స్టార్ట్‌ అయ్యింది. శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌.ఎల్‌.పి బ్యానర్‌పై దానయ్య డి.వి.వి భారీ బడ్జెట్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

డ‌బ్బింగ్ చెప్పుకున్న ర‌ష్మిక‌

న‌వ‌త‌రం క‌థానాయిక‌లు త‌మ పాత్ర‌ల‌కి తామే డ‌బ్బింగ్ చెప్పుకుంటూ వార్త‌ల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. నిత్యా మీన‌న్ లాంటి క‌థానాయిక‌లు అయితే.. కేవ‌లం త‌మ పాత్ర‌ల‌కే ప‌రిమితం కాకుండా త‌మ స‌హ‌న‌టికి కూడా డ‌బ్బింగ్ చెప్పిన సంద‌ర్భాలున్నాయి.

హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో సాయిధ‌ర‌మ్ చిత్రం

సుప్రీమ్ త‌రువాత మెగా హీరో సాయిధరమ్ తేజ్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేక‌పోయాయి. ప్రస్తుతం వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో 'ఇంటెలిజెంట్' చిత్రాన్ని చేస్తున్నాడు ఈ యువ క‌థానాయ‌కుడు. లావణ్య త్రిపాఠి నాయికగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

'ఆచారి అమెరికా యాత్ర' జనవరి 26 న విడుదల

విష్ణు మంచు హీరోగా నటించిన 'ఆచారి అమెరికా యాత్ర' చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 న విడుదల కానున్నది.