Margadarshi:మార్గదర్శిలో నిబంధనల అతిక్రమణ.. రామోజీరావు, శైలజా కిరణ్‌లపై ఏపీ సీఐడీ కేసులు

  • IndiaGlitz, [Sunday,March 12 2023]

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు, ఆయన కోడలు శైలజా కిరణ్‌లపై ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసింది. ఇటీవల ఏపీలోని మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాలు, సివ్బంది ఇళ్లలో నిర్వహించిన సోదాల్లో ఈ సంస్థ నిబంధలన ఉల్లంఘనలకు పాల్పడనట్లుగా సీఐడీ కేసులు నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్ 120(B), 409, 420, 477(A) , రెడ్ విత్ 34 కింద .. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఇన్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ 1999 సెక్షన్ 5 ప్రకారం.. చిట్ ఫండ్ యాక్ట్ 1982 లోని సెక్షన్ 76,79 ప్రకారం ఈ ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్లుగా సీఐడీ తెలిపింది. ఏ 1 నిందితుడిగా రామోజీరావు, ఏ2గా శైలజ, ఏ3గా సంబంధిత బ్రాంచ్ మేనేజర్లను చేర్చింది.

రిజిస్ట్రేషన్ శాఖ ఫిర్యాదుతో సీఐడీ సోదాలు :

అయితే ఏయే బ్రాంచ్‌లలో మార్గదర్శి సంస్థ ఉల్లంఘనలకు పాల్పడిందనే దానిపై సీఐడీ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. చిట్ ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి ఖాతాదారుల సొమ్ము మళ్లింపు, నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి మార్గదర్శిపై ఆరోపణలు వున్నట్లు సీఐడీ అధికారులు చెబుతున్నారు. నిధుల మళ్లింపుపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఫిర్యాదు చేయడంతో సీఐడీ ఈ మేరకు రంగంలోకి దిగింది. గతంలో విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, పల్నాడు, కర్నూలు, అనంతపురం చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌లు ఫిర్యాదు మేరకు విశాఖ, రాజమండ్రి, ఏలూరు, గుంటూరులలో సీఐడీ సోదాలు చేపట్టిన సంగతి తెలిసిందే.

More News

Ram Charan:ప్రియాంక చోప్రా ఈవెంట్‌కు స‌తీమ‌ణి ఉపాస‌నతో క‌ల‌సి సంద‌డి చేసిన గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్

ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు రామ్ చరణ్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అదే స‌మ‌యంలో ప‌లు ఈవెంట్స్‌లోనూ ప్ర‌త్యేకంగా పాల్గొంటున్నారు.

Rajesh Touchriver:అర్థవంతమైన సినిమా కోసం ఉప‌యోగ‌క‌ర‌మైన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను సూచించిన అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్ రాజేష్ ట‌చ్ రివ‌ర్‌

డిఫ‌రెంట్ జోన‌ర్స్‌లో సినిమాల‌ను రూపొందించి నేష‌న‌ల్ అవార్డును పొందిన ద‌ర్శ‌కుడు రాజేష్ ట‌చ్‌రివ‌ర్‌.

Kalvakuntla Kavitha:ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఈడీ విచారణకు హాజరైన కల్వకుంట్ల కవిత, ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయం వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు.

Ex CM Kiran Kumar:బీజేపీలోకి కిరణ్ కుమార్ రెడ్డి.. త్వరలోనే కాంగ్రెస్‌కు గుడ్ బై, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఆంధ్రప్రదేశ్ విభజనను చివరి వరకు వ్యతిరేకించి సొంతపార్టీపైనే పోరాటం చేశారు.

Tammareddy:బూతులు నాకూ వచ్చు, కానీ సంస్కారం అడ్డొస్తోంది.. నాకు ఐడెంటిటీ అక్కర్లేదు: నాగబాబుకు తమ్మారెడ్డి కౌంటర్

ఆస్కార్ బరిలో నిలిచిన ఆర్ఆర్ఆర్ చిత్రం యావత్ భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన సంగతి తెలిసిందే.