సస్పెన్స్‌కు తెర.. ఉద్యోగులకు 23 శాతం పీఆర్‌సీ ప్రకటించిన జగన్

  • IndiaGlitz, [Friday,January 07 2022]

గత కొన్ని నెలలుగా ఉద్యోగుల నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం పీఆర్‌సీ ప్రకటించింది. గత కొన్ని నెలలుగా జరుగుతున్న సుదీర్ఘ చర్చల అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పీఆర్‌సీపై నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 23.29 శాతం పీఆర్‌సీని ప్రకటిస్తూ ఆయన వెల్లడించారు. దీనితో పాటు ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లుకు పెంచుతున్నట్లు జగన్ తెలిపారు. పెంచిన జీతాలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అలాగే పెండింగ్‌ డీఏలు సైతం జనవరి నుంచి చెల్లించనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. 2020 ఏప్రిల్‌ నుంచి కొత్త పీఆర్సీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. జూన్‌ 30లోపు కారుణ్య నియామకాలు, అదే తేదీలోగా గ్రామ సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషనరీ డిక్లరేషన్‌ ఇవ్వాలని సీఎం నిర్ణయించినట్టు ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు.

అంతకుముందు 11వ వేతన సవరణ సంఘం నివేదిక అమలు, ఇతర 71 డిమాండ్లపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎం జగన్‌ ఉద్యోగ సంఘాల జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగ సంఘాల నుంచి ఆయన అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇవాళ ఉదయం నుంచి ఆర్థిక శాఖ అధికారులతో పీఆర్‌సీ అంశంపై సీఎం సమీక్ష నిర్వహించారు. రెండు రోజుల్లోగానే పీఆర్సీ పై నిర్ణయం తీసుకుంటామని నిన్న ఇచ్చిన హామీ మేరకు జగన్ ఎట్టకేలకు పీఆర్‌సీ ప్రకటించారు.

More News

భార్యకు కరోనా, ఫ్యామిలీకి దూరంగా క్వారంటైన్‌లో... అయినా బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన నితిన్‌

దేశవ్యాప్తంగా మరోసారి కోవిడ్ విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు.

కోరలు చాస్తున్న కరోనా.. బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌కు పాజిటివ్

దేశంలో కోవిడ్ ఓ రేంజ్‌లో విజృంభిస్తోంది. ఇవాళ కొత్త కేసుల సంఖ్య లక్ష దాటేసింది.

వనమా రాఘవ అరెస్ట్ అయ్యాడా.. లేదా... కొనసాగుతున్న సస్పెన్స్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో నిందితుడు వనమా రాఘవేంద్ర రావు అరెస్ట్ అయ్యాడా

నుమాయిష్‌పై కోవిడ్‌ ఎఫెక్ట్‌.. ఈ ఏడాది కూడా పూర్తిగా రద్దు, నాంపల్లి సొసైటీ కీలక ప్రకటన

దేశంలో కరోనా , ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో దీని ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది.

మహేశ్‌ బాబుకి కరోనా పాజిటివ్.. ఉలిక్కిపడ్డ టాలీవుడ్, కోలుకోవాలంటూ ఫ్యాన్స్ ట్వీట్లు

దేశంలో పరిస్థితులు మళ్లీ అదుపు తప్పుతున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కసారిగా కరోనా, ఒమిక్రాన్ కేసులు ఊహకందని వేగంతో పెరుగుతున్నాయి.