సోషల్ మీడియా యూజర్స్‌కు ఏపీ డీజీపీ స్ట్రాంగ్ వార్నింగ్

  • IndiaGlitz, [Thursday,June 04 2020]

సోషల్ మీడియాలో ఇష్టానుసారం వ్యవహరిస్తే కుదరదని.. కచ్చితంగా చర్యలు తీసుకుంటామని యూజర్స్‌కు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గత కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మీడియాతో మాట్లాడిన డీజీపీ.. సోషల్ మీడియాలో ప్రచారం చేసే వార్తలు అవాస్తవాలైతే ఎంతటివారైనా సరే కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పేశారు. ప్రభుత్వంపై గానీ, ప్రభుత్వ అధికారుపై గానీ కించపరిచే వ్యాఖ్యలు చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. మరీ ముఖ్యంగా.. అనుమతి లేకుండా సోషల్ మీడియాలో మహిళల ఫొటోలు షేర్ చేసినా.. అసభ్య పదజాలం వాడినా శిక్ష తప్పదన్నారు.

పోస్ట్ చేసి డెలీట్ చేసినా..

ఎవర్నయినా వ్యక్తిగతంగా దూషించినా, క్రిమినల్ పేర్లు సంభోదిస్తూ పేర్లను పెట్టినా చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు. అంతేకాదు.. ఎవరిపై అయినా కించపరుస్తూ పోస్ట్‌లు చేసి.. ఆ తర్వాత డిలీట్ చేసినా సరే కేసులు కచ్చితంగా పెడతామన్నారు. ఎందుకంటే.. డిలీట్ చేసిన పోస్ట్‌లు, మెసేజ్‌లను గుర్తించే టెక్నాలజీ తమ వద్ద ఉందని ఈ సందర్భంగా గౌతమ్ సవాంగ్ తేల్చిచెప్పారు. ఇది కేవలం ట్విట్టర్, ఫేస్‌బుక్‌కు మాత్రమే కాదు.. వాట్సప్‌కు కూడా ఇది వర్తిస్తుందన్నారు. గ్రూపులోని మెంబర్స్ చేసే పోస్టులకు అడ్మిన్స్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని డీజీపీ స్పష్టంగా వివరించారు.

100, 112 ఉపయోగపడ్డాయ్..!

‘పోలీస్‌శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ముందుకెళ్తున్నాం. పోలీస్‌శాఖలో తొలిసారిగా వీక్లీఆఫ్ కల్పించాం. 95శాతం సమస్యలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాం. స్పందన పోర్టల్ ద్వారా ప్రజలకు, పోలీసులకు మధ్య దూరం తగ్గింది. 4లక్షల మంది దిశ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్నారు. కరోనా సమయంలో డయల్ 100, 112 ఎంతో ఉపయోగపడ్డాయి. టెక్నాలజీ వాడకంలో ముందంజలో ఉన్నాం. విజయవాడ పటమట గ్యాంగ్‌ వార్‌ ఘటన దురదృష్టకరం.. వీటికి కారణమైన వారిపై కఠిన చర్యలుంటాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలుంటాయి’ అని గౌతమ్ సవాంగ్ మీడియా వేదికగా హెచ్చరించారు.

More News

షాకింగ్ : మహబూబ్ నగర్‌లో పచ్చడితో కరోనా!

వేసవికాలం వచ్చిందంటే అవకాయ పచ్చడి పెట్టుకోని తెలుగువారు ఉండరు.. అన్నంలోకి ఆవకాయ ఉంటే ఆ కిక్కే వేరబ్బా. ఇప్పుడంతా కరోనా

థియేటర్స్ ఓపెనింగ్స్‌పై కేంద్రం నిర్ణయం ఇదీ..

కరోనా నేపథ్యంలో సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు, థియేటర్స్ మూసివేయడంతో ఇండస్ట్రీకి ఏ రేంజ్‌లో నష్టం వాటిల్లిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

కరోనా పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన పాటలో హీరో నిఖిల్

కరోనా ప్రభావం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఈ విపత్కర వ్యాధి ప్రబలకుండా యావత్ దేశాలు శక్తీ మేర కృషి చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం కొనసాగుతుంది.

బాలయ్య నిజ స్వరూపం బయటపెట్టిన ప్రముఖ నిర్మాత!

టాలీవుడ్ సీనియర్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గురించి ఇండస్ట్రీలో.. రాజకీయాల్లో చాలా మంది ఏవేవో అంటుంటారు.

హైదరాబాద్‌ను వణికిస్తున్న కరోనా.. భారీగా పెరిగిన కేసులు

తెలంగాణలో కరోనా ఉధృతి రోజురోజుకూ పెరిగిపోతోంది. లాక్ డౌన్ 4.0 నుంచి కేసులు పెరిగిపోతున్నాయే తప్ప అస్సలే తగ్గే పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు.