పోలీసుల ఆంక్షలు ఛేదించి.. భద్రతా వలయాన్ని దాటుకుని, బెజవాడ చేరుకున్న ఉద్యోగులు

  • IndiaGlitz, [Thursday,February 03 2022]

పీఆర్సీ విషయంగా ఏపీ ప్రభుత్వానికి- ఉద్యోగ సంఘాలకు మధ్య వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. పలు దఫాలుగా వారిని చర్చలకు ఆహ్వానించినా.. ఉద్యోగులు మాత్రం హాజరుకాలేదు. దీంతో చిర్రెత్తిపోయిన మంత్రులు.. ఇక ఎదురుచూపులు వుండవని, వాళ్లు వస్తేనే మాట్లాడతామంటూ వ్యాఖ్యానించారు. దీనికి తోడు కొత్త పీఆర్సీ అమలు చేయాలని పట్టుదల ప్రదర్శించిన ప్రభుత్వం.. అనుకున్న ప్రకారం ఆదివారమైనా ట్రెజరీ ఉద్యోగుల్ని పనిచేయించి, జీతాలు ప్రాసెస్ చేయించింది.

ఇకపోతే.. ఈరోజున ఛలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి ఉద్యోగ సంఘాలు. కానీ దానికి అనుమతి లేదని పోలీసులు నగరంలో ఆంక్షలు విధించారు. జిల్లాల్లో పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నాలు చేసినా భద్రతా వలయాలను ఛేదించుకుని మరీ వేలాది మంది ఉద్యోగులు విజయవాడ చేరుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజయవాడలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎన్జీవో భవన్‌ నుంచి అలంకార్‌ థియేటర్‌ కూడలి మీదుగా బీఆర్‌టీఎస్‌ రోడ్డు వైపు ర్యాలీగా వెళ్లారు.

ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ పీఆర్సీ జీవోలను రద్దు చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని తేల్చి చెప్పారు. తమను అణచివేసే ప్రయత్నాలు చేస్తే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు.

చలో విజయవాడను అడ్డుకునేందుకు గాను.. పలు జిల్లాల్లో ఉన్నతాధికారులు ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ గురువారం ఆఫీసుకు రావాల్సిందేనని ఆదేశించారు. సెలవులు పెడితే అంగీకరించే ప్రశ్నే లేదని తేల్చిచెప్పారు. రెండు రోజుల ముందు నుంచే ఉద్యోగ సంఘం నేతలను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేయడంతో అనేక జిల్లాల్లో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి.

More News

గ్రాండ్‌గా మహేశ్- త్రివిక్రమ్ మూవీ లాంచ్

సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఖుషీ అయ్యే న్యూస్.. దాదాపు 12 ఏళ్ల తర్వాత మహేశ్- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మూవీ పట్టాలెక్కింది. SSMB 28 వర్కింగ్ టైటిల్‌తో వున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు గురువారం

ఇంకా రిలీజ్ కాలేదు.. అప్పుడే ఓటీటీ గురించి టాక్, సర్కార్ వారి పాటను అమెజాన్ కొనేసిందా..?

సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరో పరశు రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘‘సర్కార్ వారి పాట’’ సినిమా ఎట్టకేలకు రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. సమ్మర్ కనుకగా మే 12న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్

ఎన్టీఆర్-బుచ్చిబాబు సినిమాకు టైటిల్ ఇదేనా.. గురువుదారిలో ఉప్పెన డైరెక్టర్..?

ఆర్ఆర్ఆర్ కారణంగా దాదాపు మూడేళ్ల పాటు అభిమానులకు దూరమయ్యారు. ఇంత ఎదురుచూసినప్పటికీ ఆర్ఆర్ఆర్ మాత్రం రిలీజ్ కాకపోవడంతో ఫ్యాన్స్ మరింత నిరాశకు గురవుతున్నారు.

ఫ్యాన్స్‌కు మళ్లీ నిరాశ... ఎన్టీఆర్- కొరటాల ఓపెనింగ్‌ వాయిదా...?

సినీ పరిశ్రమకు గత కొంతకాలంగా టైం బాగున్నట్లు లేదు. కోవిడ్, లాక్‌డౌన్ సమస్యలకు తోడు ప్రభుత్వాల జోక్యంతో చిత్ర పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఎప్పుడు ఏం వార్త వినాల్సి వస్తోందన్న

'రావణాసుర' సెట్‌లో అడుగు పెట్టిన రవితేజ

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్‌లో రాబోతోన్న `రావణాసుర` సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఫ‌స్ట్ షెడ్యూల్‌లో సుశాంత్, ఇతర తారాగణం