జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. మూడు రాజధానుల బిల్లు వెనక్కి

ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ నిమిత్తం ఉద్దేశించిన మూడు రాజధానుల బిల్లుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు అడ్వకేట్‌ జనరల్‌ తెలిపారు. మూడు రాజధానులపై అసెంబ్లీలో పూర్తి వివరాలు వెల్లడిస్తారని.. దీనిపై అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్‌ అధికారికంగా ప్రకటిస్తారని ఏజీ కోర్టుకు తెలిపారు.

పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లును కేబినెట్ రద్దు చేసినట్లు అడ్వకేట్ జనరల్ కోర్టుకు చెప్పారు. అంతకుముందే మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెక్నికల్‌గా చాలా సమస్యలు వస్తున్నాయని, అందుకే 3 రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు పరోక్షంగా ఆయన సంకేతాలు ఇచ్చారు. దీంతో జగన్ అసెంబ్లీలో చేయబోయే ప్రకటనపై రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా రాజధాని ప్రాంతవాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బిల్లులోని లోపాలను సరిచేసి మళ్లీ కొత్తగా ప్రవేశపెడతారని కొందరు అంటుంటే.. లేదు అమరావతినే ఏకైక రాజధానిగా జగన్ కొనసాగించనున్నారని ప్రచారం జరుగుతోంది. మరి జగన్ మనసులో ఏముందనేది మరికొద్దిసేపట్లోనే తేలిపోనుంది.

More News

తెలుగులో విడుదల కానున్న మోహన్‌లాల్ ‘‘మరక్కార్’’

మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ నటించిన ‘మరక్కర్‌’ విడుదల విషయంలో నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడిన సంగతి తెలిసిందే.

బిగ్‌బాస్ ఫేమ్ ప్రియ ఇంట్లో పెళ్లివేడుక.. కంటెస్టెంట్ల సందడి

సినిమాలు,  సీరియల్స్‌లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది ప్రియ. దీంతోనే ప్రియకు బిగ్‌బాస్‌ షో తెలుగు 5వ సీజన్‌లో ఛాన్స్ దక్కింది.

బిగ్‌బాస్ 5 తెలుగు: హౌస్ నుంచి యానీ అవుట్.. రవి, కాజల్, సన్నీలకి ఏం చెప్పిందంటే..?

బిగ్‌బాస్ 5 తెలుగు రాను రాను ఉత్కంఠగా మారుతోంది. హౌస్‌లో బాగా పర్ఫామెన్స్ ఇచ్చిన యానీ మాస్టర్ ఈరోజు ఎలిమినేట్ అయ్యారు.

వైరల్: ఫ్యామిలీతో ప్యారిస్‌ టూర్.. కొడుకు అభయ్ రామ్‌ ఫోటోను షేర్ చేసిన ఎన్టీఆర్

సినిమాలు, బుల్లితెర కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా వుండే  యంగ్‌టైగర్ ఎన్టీఆర్ వర్క్‌కి కాస్త బ్రేక్ ఇచ్చాడు.

‘‘ మీరు ఇంటికి తిరిగి రావాలి.. సెలబ్రేట్‌ చేసుకోవాలి’’.. కైకాల ఆరోగ్యంపై చిరు ట్వీట్

దిగ్గజ న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ ఆరోగ్యంపై మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు.