ఏపీ హైకోర్టులో ఎస్ఈసీకి చుక్కెదురు.. పెద్దిరెడ్డికి గ్రీన్ సిగ్నల్ 

  • IndiaGlitz, [Sunday,February 07 2021]

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు చుక్కెదురైంది. పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టేసింది. పెద్దిరెడ్డి హౌస్ అరెస్ట్‌పై ఆదేశాలు చెల్లవని స్పష్టం చేసింది. దీంతో మంత్రికి హైకోర్టులో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లువ్వగా.. ఎస్ఈసీకి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. శనివారం నాడు ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ మంత్రి హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై ఇవాళ ఉదయం నుంచి మంత్రి తరఫు, ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాదుల వాదనలను నిశితంగా విన్న హైకోర్టు.. పెద్దిరెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కొన్ని విషయాల్లో మాత్రం ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సమర్థించింది. మంత్రి మీడియాతో మాట్లాడేందుకు వీల్లేదని ఎస్ఈసీ ఉత్తర్వులను హైకోర్టు సమర్ధించింది. ఒక్క ఎన్నికల కమిషన్ గురించే కాదు ఎలాంటి విషయాలపైనా మీడియాతో మాట్లాడకూడదని మంత్రిని హైకోర్టు ఆదేశించింది.

కాగా.. పంచాయతీ ఎన్నికల్లో గీత దాటిన పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితం చేయాలని, మీడియాతో కూడా మాట్లాడేందుకు వీల్లేకుండా చేయాలని.. గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసే ఈ నెల 21 వరకూ ఈ ఆదేశాలను అమలు చేయాలని ఆదేశిస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ లేఖ రాశారు. అంతకుముందు వీరిరివురూ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు. నిమ్మగడ్డ ఒక మ్యాడ్ ఫెలో అని కూడా పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇలా విమర్శల అనంతరం పెద్దిరెడ్డి తనపై ఎస్ఈసీ ఆదేశాల పట్ల హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ ఉదయం నుంచి పెద్దిరెడ్డి విషయంపైనే వాదనలు విన్న హైకోర్టు.. మధ్యాహ్నం 12 గంటలకు పైవిధంగా తీర్పును వెల్లడించింది.

More News

పవర్‌స్టార్‌ దగ్గర పని చేశాడు... మాస్‌ మహారాజా దగ్గరకొచ్చాడు!

మాస్‌ మహారాజా రవితేజ ప్రజెంట్‌ ‘ఖిలాడి’ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత కొత్త దర్శకుడికి ఛాన్స్‌ ఇవ్వబోతున్నాడని ఫిల్మ్‌నగర్‌ టాక్‌.

‘ఆదిపురుష్‌’ను ‘రాధేశ్యామ్‌’ ఫాలో అవుతున్నాడా?

ప్రభాస్‌ రూటు మార్చాడు. అభిమానులకు షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. అవన్నీ స్వీట్‌ షాకులే అనుకోండి.

ఫిబ్రవరి నెలాఖరున సత్తారు సెట్‌కి కింగ్‌

‘గరుడవేగ’ సినిమాతో దర్శకుడిగా ప్రవీణ్‌ సత్తారు సత్తా ఏమిటో ఇండస్ట్రీకి తెలిసింది. సెన్సిబుల్‌ సినిమా ‘చందమామ కథలు’ తీసిన వ్యక్తిలో ఇంత విషయం ఉందా?

ఎడారిలో మహేష్‌ కుమార్తె సితార

ఎడారిలో సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు కుమార్తె సితార ఎంజాయ్‌ చేసింది. ఒంటెలు, బైకులు, డన్‌ బగ్గీస్‌లో షికార్లు చేసింది.

పవన్ పేరులో కిక్కే వేరప్పా... అదో మాదిరి ఉప్పెన!

'కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు' - 'గబ్బర్ సింగ్'లో డైలాగ్. విలన్ ఇంటికి పవన్ కటౌట్‌తో బ్రహ్మానందం వెళ్లే సీన్‌కి థియేటర్లలో విజిల్స్ పడ్డాయి.