‘పవన్.. నువ్ ఏ రోజైనా చిరంజీవి పేరు చెప్పావా?’

  • IndiaGlitz, [Tuesday,November 05 2019]

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై.. మంత్రి కన్నబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ తలపెట్టిన లాంగ్‌మార్చ్‌ తర్వాత వైసీపీ-జనసేన పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇసుక కొరతపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. ‘అధికారంలో ఉన్నా, లేకున్నా వైఎస్ జగన్‌నే టార్గెట్ చేసి మాట్లాడడమేంటి..?. చంద్రబాబు తప్ప మరో నాయకుడు పవన్‌కు కనపడడంలేదా..? ‘నా రాజకీయ జీవితంలో ఎలాంటి దాపరికం లేదు.. చిరంజీవి గారి వల్లే రాజకీయాల్లోకి వచ్చానని నేటికీ చెబుతాను. కానీ పవన్ కల్యాణ్ ఏనాడైనా చిరంజీవి గారి పేరు చెప్పారా?. సినిమాల్లోకి వచ్చినప్పుడు చిరంజీవి తమ్ముడని చెప్పుకున్న పవన్‌ ఇప్పుడు కానిస్టేబుల్‌ కొడుకుని, పోస్టుమెన్‌ మనవడిని అని కొత్తగా బ్రాండింగ్‌ చేసుకుంటున్నారు’ అని పవన్‌పై కన్నబాబు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే మంత్రి ఈ మాటలు ఎందుకు అన్నారంటే.. విశాఖలో జరిగిన లాంగ్ మార్చ్ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పవన్ మాట్లాడుతూ కన్నబాబు బతుకు తమకు తెలియంది కాదని, కన్నబాబును రాజకీయాల్లోకి తెచ్చింది తామేనని అనడంతో ఇందుకు కౌంటర్‌గా పై విధంగా కౌంటర్లు, ప్రశ్నలల వర్షం కురిపించారు.

కనీసం జ్ఞానం కూడా లేదా!?

‘పవన్‌ కల్యాణ్‌ సినిమాలు వదిలినా.. యాక్టింగ్‌ వదల్లేదు. పవన్‌ డ్రామాలు చూసి ప్రజలంతా నవ్వుకుంటున్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్‌ యాక్టింగ్‌ పండడం లేదు. చంద్రబాబుకు దత్తపుత్రుడు అంటే పవన్‌కు కోపంతో లాంగ్‌ మార్చ్‌ చేశాడు.. కానీ, భవన నిర్మాణ కార్మికులపై చిత్తశుద్ధితో కాదని స్పష్టంగా అర్థమవుతుంది. కార్మికుల సంక్షేమ నిధిని కాజేసిన అచ్చెన్నాయుడిని పక్కనబెట్టుకొని మాట్లాడిన పవన్‌కు కార్మికుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. మాట్లాడితే నీ బతుకు నాకు తెలుసని అంటున్నాడని, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మన బతుకులు కాదు ప్రజల బతుకుల గురించి ఆలోచించాలనే కనీసం జ్ఞానం కూడా పవన్‌కు లేదా..?’ అని ఈ సందర్భంగా పవన్‌పై కన్నబాబు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు.

More News

సునీల్ చేతుల మీదుగా 'అప్పుడు- ఇప్పుడు' సినిమా సాంగ్ విడుదల

సుజన్, తనీష్క్ హీరో హీరోయిన్లుగా యు.కె.ఫిలింస్ బేనర్ పై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు నిర్మాత‌లుగా చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం `అప్పుడు-ఇప్పుడు`.

జనసేనకు 70 సీట్లు వచ్చేవి కానీ... పవన్

‘జనసేన సమావేశాలకు వచ్చిన యువతలో 70 శాతం మంది పార్టీకి ఓట్లు వేసినా 70 సీట్లు వచ్చేవి.

గోపీచంద్‌కి నో రెమ్యున‌రేష‌న్‌?

టాలీవుడ్ యాక్ష‌న్ హీరోగా పేరు సంపాదించుకున్న మ్యాచో హీరో గోపీచంద్‌కు ప్ర‌స్తుతం మార్కెట్ వేల్యూ లేకుండా పోయింది.

తహసీల్దార్ హత్యతో రెవెన్యూ అధికారులకు కొత్త తలనొప్పి!

హైదరాబాద్‌లో తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయ్.

చిరు మైత్రీతో చేస్తాడా?

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత `ఖైదీ నంబ‌ర్ 150`, `సైరా న‌ర‌సింహారెడ్డి` చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సాధించాడు.