మంత్రి హోదాలో ప్రగతి భవన్‌కు రోజా.. కేసీఆర్‌తో భేటీ, బొట్టుపెట్టి సత్కరించిన సీఎం ఫ్యామిలీ

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో రోజా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు సీఎం సతీశణి శోభ, కుమార్తె కల్వకుంట్ల కవితలు సాంప్రదాయ పద్ధతిలో బొట్టు పెట్టి వస్త్రాలు బహూకరించారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఆశీర్వాదం తీసుకోవడానికే ప్రగతి భవన్‌కు వచ్చినట్లు తెలిపారు. కేసీఆర్ తనను ఓ కూతురి మాదిరిగా చూస్తారని చెప్పారు.

అలాగే ఆంధ్రప్రదేశ్‌లో పాలనపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు రోజా కౌంటరిచ్చారు. ఏపీ విషయంలో ఆయనను ఎవరో తప్పుదోవ పట్టించారని వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ పొరుగు రాష్ట్రాలు అన్నారు కానీ ఆంధ్రప్రదేశ్‌ అనలేదని రోజా ప్రస్తావించారు. ఒక వేళ ఏపీ గురించి అని ఉంటే తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆమె చెప్పారు. కేటీఆర్‌ను ఆంధ్రప్రదేశ్‌కు సాదరంగా ఆహ్వానిస్తున్నానని, ఆయనతో పాటు ఆయనకు చెప్పిన ఫ్రెండ్‌ కూడా వస్తే.. ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని దగ్గరుండి చూపిస్తానని రోజా స్పష్టం చేశారు.

ఏపీ పథకాలను ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్నారని.. నాడు-నేడు కింద బడులు, ఆసుపత్రులు ఎలా అభివృద్ధి చేశామో చూపిస్తామని ఆమె పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతిన్నాయని... కొవిడ్‌ తర్వాత రాష్ట్రంలో 9 వేల కిలోమీటర్ల అంతర్గత రహదారులు ఏ విధంగా వేస్తున్నారో చూపిస్తామని రోజా చెప్పారు. కేంద్రంతో కలిసి జాతీయ రహదారుల నిర్మాణం ఎలా జరిగిందో వివరిస్తామని.. అవినీతికి తావులేకుండా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నామని మంత్రి రోజా చెప్పారు. కేటీఆర్‌ తేదీ, సమయం ఇస్తే.. పర్యాటక శాఖ మంత్రిగా రాష్ట్రమంతా తిరిగి చూపిస్తానని ఆమె పేర్కొన్నారు.

More News

'సర్కారు వారి పాట', పోకిరి కి మించిన బ్లాక్ బస్టర్ అవుతుంది: మార్తాండ్ కె. వెంకటేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట' విడుదలకు సిద్దమౌతుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్

శ్రీవిష్ణు, కేథ‌రిన్ థ్రెసా 'భళా తందనాన' మే 6న విడుదల

ప్రామిసింగ్ యంగ్ హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా, వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న చిత్రం ‘భళా తందనాన’.

టాలీవుడ్‌లో మరో విషాదం.. కరెంట్ షాక్‌తో యువ దర్శకుడు దుర్మరణం

తెలుగు చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఘట్టమనేని రమేష్ బాబు, నారాయణ దాస్ నారంగ్, సీనియర్ నటుడు బాలయ్య తదితరులు మృతిచెందారు.

ఎన్టీఆర్ 30 నుంచి ఆలియా అవుట్... ఛాన్స్ కోసం ఇద్దరు పాన్ ఇండియా హీరోయిన్స్ పోటీ

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌తో కలిసి ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

‘‘ఆచార్య’’లో మరో సర్‌ప్రైజ్ : గెస్ట్‌ రోల్‌లో సత్యదేవ్.. ప్రౌడ్ ఆఫ్ యూ అంటూ చిరు ట్వీట్

కృషి , పట్టుదల, శ్రమించేతత్వం వుంటే ఏ గాడ్ ఫాదర్ లేకపోయినా అత్యున్నత శిఖరాలను