'AP04 రామాపురం' ట్రైలర్ విడుదల

  • IndiaGlitz, [Saturday,November 26 2022]

అర్ అర్ క్రియేటివ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్ వి శివ రెడ్డి సమర్పణలో రామ్ జాక్కల, అఖిల ఆకర్షణ, పి.యన్ రాజ్, సునీల్ మల్లెం, నటీనటులుగా హేమ రెడ్డి దర్శత్వంలో రామ్ రెడ్డి అందూరి నిర్మించిన చిత్రం ”AP04 రామాపురం” . ఈ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్లను ప్రముఖ సినీ,రాజకీయ నాయకులు అవిష్కరించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను నేడు ప్రసాద్ లాబ్స్ లో ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ ఫేమ్ సోహెల్, జెస్సి తో పాటు నటుడు పృథ్వి పాల్గొన్నారు.

బిగ్ బాస్ జెస్సి మాట్లాడుతూ.. టైటిల్ చాలా క్యాచీగా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది. టీం అందరికి అల్ ది బెస్ట్.

నటుడు పృథ్వి రాజ్ మాట్లాడుతూ... మీడియా మిత్రులకు నమస్కారం. ఈ సినిమా డైరెక్టర్ గురించి చెప్పాలి మోస్ట్ డేడికేటడ్ వర్కర్. చాలా తక్కువ బడ్జెట్ లో హీరో ఎలివేషన్స్ అవి బాగా తీసాడు. మీడియా మిత్రులే ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లాలి.డిసంబర్ 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్న.

హీరో నందు మాట్లాడుతూ... ఒక టాలెంట్ ను నమ్మి ఎంకరేజ్ చేస్తున్న ప్రొడ్యూసర్స్ అందరికి థాంక్యూ అండి. కడపలో సినిమాకు సంబంధించి ఎటువంటి సపోర్ట్ ఉంది నాకు తెలియదు. కానీ సినిమా చేసారు. అదే ఇక్కడ తీసుంటే ఇంకా బాగా తీసేవాళ్ళేమో. ఈ సినిమాకు మంచి కలక్షన్స్ రావాలని కోరుకుంటున్న.

సోహెల్ మాట్లాడుతూ... నన్ను ఇక్కడికి పిలిచినందుకు థాంక్యూ. డైరెక్టర్ చాలా పనులు చేసుకుని ఈ స్థాయికి వచ్చారు.ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది. ఈ సినిమా ను దర్శకుడు తక్కువ బడ్జెట్ లో బాగా చేసాడు. ఈ సినిమా డిసంబర్ 9న రిలీజ్ అవుతుంది చూసి ఎంకరేజ్ చెయ్యండి.

దర్శకుడు హేమ రెడ్డి మాట్లాడుతూ... ముందుగా ప్రింట్ మీడియాకు కృతజ్ఞతలు 19 ఏళ్ళు అప్పుడు ఈ సినిమా రాయడం స్టార్ట్ చేశాను. 23 ఏళ్లకు డైరెక్షన్ చేశాను. సినిమా ఇండస్ట్రీలో సపోర్ట్ ఉండదు అంటారు. కానీ నా సినిమాకోసం ఇంతమంది వచ్చి ఎంకరేజ్ చేసారు అందరికి చాలా పెద్ద థాంక్స్ అండి.

నిర్మాత మాట్లాడుతూ... చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా మా సినిమాను ఎంకరేజ్ చెయ్యడానికి వచ్చిన మీ అందరికి చాలా పెద్ద థాంక్స్ అండి. మాకు ఉన్న చిన్న బడ్జెట్ లో ఈ సినిమాను చేసాం. ఇంకొంచెం ఎక్కువ డబ్బులు ఉంటే ఇంకా మంచి సినిమా తీసేవాళ్ళం. మా సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాం.

More News

Pavithra Lokesh - Naresh : మమ్మల్ని అల్లరి చేస్తున్నారు.. ట్రోలింగ్‌పై సైబర్ క్రైమ్‌కు పవిత్రా లోకేష్ ఫిర్యాదు

కన్నడ నటి పవిత్రా లోకేష్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

‘పంచ తంత్రం’ డిసెంబ‌ర్ 9న రిలీజ్

డా.బ్ర‌హ్మానందం, స్వాతి రెడ్డి, స‌ముద్ర ఖ‌ని, రాహుల్ విజ‌య్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, న‌రేష్ అగ‌స్త్య‌, దివ్య ద్రిష్టి, వికాస్ ముప్ప‌ల త‌దిత‌రులు

BiggBoss: బిగ్‌బాస్ 6 చివరి కెప్టెన్‌గా ఇనయా, శివంగిలా పోరాడి నేరుగా సెమీస్‌లోకి

బిగ్‌బాస్ 6 తెలుగులో ప్రస్తుతం కుటుంబ సభ్యుల కలయిక జరుగుతున్న సంగతి తెలిసిందే. తొలుత ఆదిరెడ్డి భార్యా కూతురు,

SreeMukhi : ఎర్ర కోక కట్టి నడుము, బొడ్డు చూపిస్తూ... కేక పుట్టిస్తోన్న రాములమ్మ

తెలుగు బుల్లితెరను ఏలుతున్న కొద్దిమంది స్టార్ యాంకర్స్‌లో శ్రీముఖి ఒకరు.

Rama Jogayya Sastry : ఆ ట్రోలింగ్‌కు హర్ట్.. దండం పెట్టేసిన రామజోగయ్య శాస్త్రి, పోస్ట్ వైరల్

నందమూరి అభిమానులకు ట్రీట్ ఇవ్వాలనే ఉద్దేశంతో గోపీచంద్ మలినేని- బాలయ్య కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న వీరసింహారెడ్డి నుంచి జై బాలయ్య సాంగ్‌ను వదిలారు మేకర్స్.