ఇండియాలో రికార్డ్ స్థాయిలో ఆపిల్ అమ్మకాలు..

  • IndiaGlitz, [Friday,October 30 2020]

భారతదేశంలో ఇటీవలే ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించిన టెక్ దిగ్గజ సంస్థ ఆపిల్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్ అమ్మకాలు క్షీణించాయి. అయితే ఇండియాలో మాత్రం గణనీయమైన అమ్మకాలను ఆపిల్ సంస్థ నమోదు చేస్తోంది. ఇటీవలి కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగిన విషయం తెలిసిందే. అత్యంత ఖరీదైన ఫోన్‌ ఆపిల్. దీనిని స్టేటస్ సింబల్‌గా భావిస్తుంటారు. దీంతో ఇండియాలో సైతం రికార్డ్ స్థాయిలో ఆపిల్ అమ్మకాలు జరిగాయి.

ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసిక అమ్మకాల్లో భారతీయ స్మార్ట్ ఫోన్ విభాగంలో రికార్డ్ స్థాయిలో ఆపిల్ అమ్మకాలు సాగించి.. అమెరికా, యూరప్, ఆసియా, పసిఫిక్ దేశాల సరసన నిలిచింది. ఈ విషయాన్ని స్వయంగా ఆపిల్ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. భారతదేశంలో సెప్టెంబర్ 23న తమ ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించిన నేపథ్యంలో మంచి ఆదరణ లభిస్తోందని టిమ్ కుక్ వెల్లడించారు.

క్షీణించిన గ్లోబల్ అమ్మకాలు..

అక్టోబర్ 29న క్యూ4 ఫలితాలను ఆపిల్‌ ప్రకటించింది. ఐఫోన్ గ్లోబల్ అమ్మకాలు 20 శాతం క్షీణించాయని ఆపిల్ సంస్థ వెల్లడించింది. కంపెనీ మొత్తం ఆదాయం ఈ త్రైమాసికంలో స్వల్పంగా పుంజుకుని 64.7 బిలియన్‌ డాలర్లుగా ఉంది. లాభం కూడా 7 శాతం తగ్గి.. 12.7 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. అక్టోబర్‌ 23 న ప్రారంభించిన కొత్త ఐఫోన్లకు మంచి ఆదరణ లభిస్తోందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

More News

మూడు చిత్రాలను ప్రకటించిన ఫోర్బ్స్‌లో చోటు దక్కించుకున్న యువ వ్యాపారవేత్త సురేష్‌రెడ్డి

కొవ్వూరి సురేష్‌రెడ్డి... యానిమేషన్‌ గేమింగ్ రంగంలో ఈ పేరు సుపరిచితమే.

టీడీపీ నేతలపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..

మంత్రి కొడాలి నాని టీడీపీ నేతలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ..

ఈసారి కూడా ట్రంపే గెలుస్తారట...

నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు సమయం పెద్దగా లేదు. అయితే ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేదే ఆసక్తికర విషయం.

ఫైనల్‌గా షాక్ ఇచ్చిన పునర్నవి..

బిగ్‌బాస్ ఫేమ్, ప్రముఖ నటి పునర్నవి భూపాలం.. గత మూడు రోజులుగా సోషల్ మీడియా వేదికగా నడుపుతున్న హైడ్రామాకు నేటితో ఫుల్ స్టాప్ పెట్టింది.

పవర్ స్టార్ సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరో కొత్త సినిమాను ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.