close
Choose your channels

మురుగ‌దాస్‌, విజ‌య్, కీర్తి సురేష్ మూవీ అప్‌డేట్‌

Saturday, June 2, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మురుగ‌దాస్‌, విజ‌య్, కీర్తి సురేష్ మూవీ అప్‌డేట్‌

త‌మిళ అనువాద చిత్రం 'గజని'తో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన త‌మిళ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్. ఆ సినిమా త‌రువాత మెగాస్టార్ చిరంజీవితో స్ట్ర‌యిట్ ఫిల్మ్‌ 'స్టాలిన్' చేసి తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు. ఆ త‌రువాత ఈ దర్శకుడి తమిళ సినిమాలు తెలుగులో కూడా అనువాదమవుతూ వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇంతవరకు కేవలం ఇద్దరు హీరోలతో మాత్రమే రిపీటెడ్‌గా సినిమాలను చేశారు మురుగ‌దాస్‌.

అందులో ఒకరు సూర్య ('గజని', '7th సెన్స్')కాగా.. మరొకరు విజయ్ ('తుపాకి', 'కత్తి'). అయితే.. వీటిలో విజయ్‌తో చేసిన సినిమాలు రెండూ బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ఈ నేప‌థ్యంలో.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి విజయ్‌తో జట్టు కట్టారు మురుగదాస్. ప్ర‌స్తుతం ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది.

మ‌హాన‌టితో ఘ‌న‌విజ‌యాన్ని అందుకున్న కీర్తి సురేష్ ఇందులో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇదిలా ఉంటే .. విజయ్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 22న ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను కూడా ప్రకటించనున్నారు. దీపావ‌ళికి సినిమా తెర‌పైకి రానుంది.

ఇప్పటికే రెండు సార్లు బ్లాక్ బస్టర్ హిట్స్‌ని అందించిన ఈ ద్వయం.. ఇప్పుడు ఈ చిత్రంతో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేస్తుందేమో చూడాలి. తెలుగులోనూ ఈ సినిమా అనువాదం కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.