చిరంజీవి సినిమాకి ఎ.ఆర్. రెహమాన్ సంగీతం!

  • IndiaGlitz, [Tuesday,June 20 2017]

చిరంజీవి తన 151వ చిత్రంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రను పోషించబోతున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్‌ బేనర్‌పై రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. నటీనటుల, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది.
ఎంతో ప్రతిష్ఠాత్మక నిర్మాణం జరుపుకోనున్న ఈ చిత్రానికి సంబంధించి మరో విశేషమేమిటంటే ఆస్కార్‌ అవార్డ్స్‌ గ్రహీత ఎ.ఆర్‌.రెహమాన్‌ ఈ చిత్రానికి సంగీతం అందించడం. దేశభక్తి ప్రధానంగా రూపొందే ఈ చిత్రానికి రెహమాన్‌ అయితేనే సంగీత పరంగా పూర్తి న్యాయం చెయ్యగలడన్న ఉద్దేశంతో వున్నారు చిత్ర యూనిట్‌. ఈ చిత్రం కోసం రెహమాన్‌ను రంగంలోకి దించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే చిరంజీవి, ఎ.ఆర్‌.రెహమాన్‌ ఫస్ట్‌ కాంబినేషన్‌లో సినిమా రాబోతోందన్నమాట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం వుంది.

More News

'తెలంగాణ ఫిలిం చాంబర్' ఆధ్వర్యంలో సినారె సంస్మరణ సభ

'తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్' ఆధ్వర్యంలో రచయిత సి. నారాయణరెడ్డి సంస్మరణ సభ సోమవారం సాయంత్రం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది.

సెన్సార్ పూర్తి చేసుకొన్న 'మాయా మాల్'

దిలీప్, ఇషా, దీక్షాపంత్ ముఖ్యపాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం "మాయామాల్". హారర్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని "యు/ఎ" సర్టిఫికెట్ అందుకొంది. జూన్ 30న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

'నమకం..చమకం..' స్థానంలో కొత్త పదాలు చేరిక

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ ఎస్.హరీష్ శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు, శిరీష్ నిర్మాతలుగా రూపొందిన కమర్షియల్ ఎంటర్టైనర్ `డీజే దువ్వాడ జగన్నాథమ్`.

సంక్రాంతి బరిలోకి బాలయ్య...

నందమూరి బాలకృష్ణ చాలా వేగంగా సినిమాలను పూర్తి చేసేస్తున్నాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 101వ సినిమా చేస్తున్న బాలయ్య వచ్చే నెలలో 102వ సినిమాను స్టార్ట్ చేయనున్నాడు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

గోపీచంద్ కెరీర్ లో భారీ మొత్తానికి శాటిలైట్...

టాలీవుడ్ హంక్ గోపీచంద్ ఇప్పుడు సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న సినిమా `గౌతమ్ నంద`. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.