close
Choose your channels

'2.0' గురించి రెహ‌మాన్ స్పీచ్‌!

Saturday, November 3, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్ న‌టించిన సినిమా `2.0`. ఈ సినిమా ట్రైల‌ర్ లాంచ్‌లో సంగీత ద‌ర్శ‌కుడు రెహ‌మాన్ మాట్లాడారు. ఈ సినిమాకు ప‌నిచేయ‌డం గురించి చెప్పారు. ర‌జ‌నీకాంత్‌, ఎమీ జాక్స‌న్ న‌టించిన సినిమా ఇది. అక్ష‌య్‌కుమార్ కీల‌క పాత్ర‌ధారి. లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించింది.

రెహ‌మాన్ మాట్లాడుతూ ``ఈ సినిమాలో ముందు మేం పాట‌లు లేవ‌నుకున్నాం. కేవ‌లం బ్యాక్ గ్రౌండ్ స్కోరే అనుకున్నాం. కానీ ఇప్పుడు నాలుగు పాట‌లున్నాయి. ఇందిర‌లోకం.. అనే పాట‌కోసం దాదాపు 12.13 ట్యూన్ల త‌ర్వాత శంక‌ర్‌గారు ఈ ట్యూన్ సెల‌క్ట్ చేశారు.

ముందు రీరికార్డింగ్ను కీబోర్డ్, కంప్యూట‌ర్స్ లో కంపోజ్ చేశాం. నెల రోజుల క్రితం 100 మంది ఆర్కెస్ట్రా లండ‌న్లో, ముంబైలో 40 మంది, చెన్నైలో ఇంకొంత‌మందితో చేశాం. అయినా విజువ‌ల్స్ కొన్నిటిని చూసిన‌ప్పుడు నేను చేసిన సంగీతం చాళ్లేద‌నిపించింది. ఇప్పుడు ఇంకా చేశాం. సినిమాక‌న్నా వారం రోజుల ముందు రీరికార్డింగ్‌లో కొంత భాగాన్ని రిలీజ్ చేస్తాం.

ఒక ప‌ర్స‌నాలిటీ లైక్ చేయాలంటే వాళ్లు.. `ఎక్క‌డి నుంచి ఎక్క‌డికి వెళ్లారు. వాళ్ల జీవితం ఎలా ఎగ్జాంపుల్‌గా ఉంది` వంటి విష‌యాల‌ను గురించి ఆలోచిస్తాం. నాకు ర‌జ‌నీకాంత్‌గారు చాలా ర‌కాలుగా స్ఫూర్తినిచ్చారు. ఆయ‌న స్పిరిచువాలిటీగానీ, ఆయ‌న సినిమాలోని చిన్న చిన్న డైలాగులుగానీ నాకు ఇష్టం. ఈ వ‌య‌సులోనూ ఇలాంటి సినిమాలు చేయాల‌ని ఆశ ఉండ‌టం చాలా గొప్ప‌. చిన్న‌త‌నం నుంచి సంగీత రంగంలో ఉండ‌టం వ‌ల్ల నేను 40 ఏళ్ల‌ప్పుడు రిటైర్ కావాల‌ని అనుకున్నా. అప్పుడే `రోబో` సినిమా చేస్తున్నా. ఆ సెట్‌కి వెళ్లి ర‌జ‌నీకాంత్‌గారిని చూశాక , ఆఫ్ సెట్‌, ఆన్ సెట్ ఆయ‌న్ని చూశాక నా మ‌న‌సు మారింది. ఇవాళ నేను సంగీత రంగంలో ఉండ‌ట‌మే గొప్ప‌ క‌టాక్షంగా భావిస్తున్నా. నా తండ్రి ద్వారా వ‌చ్చిన గౌర‌వంగా భావిస్తున్నా. ఆ గౌర‌వాన్ని స్వీక‌రించి స‌ర్వీస్ చేస్తున్నా. మా నాన్న‌కి, గాడ్‌కీ సంగీతంతో సంగీతం చేస్తున్నా.

2.0`కి ప‌నిచేసిన అనుభ‌వం అనేది 8 సినిమాలు చేసిన‌ట్టు అనిపిస్తోంది. నాలో చాలా మార్పు వ‌చ్చింది. నేను 3 ఏళ్లు ముందు వేరు., 2 ఏళ్ల ముందు వేరు. ఇప్పుడు వేరు.ఇందాకే చెప్పిన‌ట్టు గ‌త రెండు నెల‌లుగా సినిమాలోని ఎఫెక్ట్స్ చూసిన‌ప్పుడు నా సంగీతం వాటి ముందు చాళ్లేద‌నిపించింది. అందుకే ఇంకా కృషి చేశా. ఈ చిత్రంలో అక్ష‌య్‌కుమార్ చాలా పెద్ద ఇన్‌స్ప‌యిరింగ్ రోల్ చేశారు. సుభాస్క‌ర‌న్‌గారు, ర‌సూల్ పూకొట్టి, ఇంకా చాలా చాలా మందికృషి చేశారు. ఇందిర లోకం పాట రాసిన కీర్తి శేషులు నా. ముత్త‌కుమార్‌కీ, మా అబ్బాయి ఎ.ఆర్‌.అమీన్‌కీ థాంక్స్`` అని అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.