డిటిఎస్ మిక్సింగ్ లో అరకు రోడ్ లో...

  • IndiaGlitz, [Sunday,October 16 2016]

రాం శంక‌ర్‌, నికిషా ప‌టేల్ జంట‌గా శేషాద్రి క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందుతున్న చిత్రం 'అర‌కు రోడ్ లో'. వాసుదేవ్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ చిత్రానికి మేకా బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, బి.భాస్క‌ర్‌, వేగిరాజు ప్ర‌సాద రాజు, రామేశ్వ‌రి న‌క్కా లు నిర్మాతలు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి డిటిఎస్ మిక్సింగ్ జరుగుతోంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ప్రస్తుతం మా 'అర‌కు రోడ్ లో' చిత్రానికి డిటిఎస్ మిక్సింగ్ జరుగుతోంది. దీంతో అన్ని కార్యక్రమాలు పూర్తి అయినట్లే. ఇటీవల విడుదలయిన ఆడియో కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన రావడం మాకెంతో ఆనందాన్నిచ్చింది. ముఖ్యముగా ప్రభాస్ గారు విడుదల చేసిన సాంగ్ కి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. దర్శకుడు వాసుదేవ్ మంచి కథ తో ఈ సినిమాని తెరకెక్కించాడు. అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. అతి త్వరలో రిలీజ్ డేట్ తెలుపుతాము..అని అన్నారు.

More News

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో 'లక్ష్మీ బాంబ్'

మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్ పాత్రలో గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో

ఆర్.నారాయణమూర్తి, జయసుధ జంటగా అక్టోబర్ 19న ప్రారంభం కానున్న 'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య'

వినూత్నమైన కథాంశంతో తెరకెక్కి రూ25కోట్లకు పైగా వసూళ్లను సాధించిన 'బిచ్చగాడు' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్.

క్రిస్మస్ బరిలోకి సునీల్....

కమెడియన్ టర్డ్న్ హీరో సునీల్ మంచి సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు.జయాపజయాలకు సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు.

మరోసారి మెగా హీరోకు విలన్ గా....

దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది పినిశెట్టి ఒక విచిత్రం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్న ఎక్కడికి పోతావు చిన్నవాడా టీజర్..!

స్వామి రారా,కార్తికేయ,సూర్య వెర్సెస్ సూర్య చిత్రాలతో వరుసగా విజయాలు సాధించిన నిఖిల్ నటించిన తాజా చిత్రం ఎక్కడికిపోతావు చిన్నివాడా.