close
Choose your channels

అర‌వింద స‌మేతా.. అత్యంత వేగంగా!

Monday, September 3, 2018 • తెలుగు Comments

అర‌వింద స‌మేతా.. అత్యంత వేగంగా!

సినిమా మొత్తం పూర్త‌య్యాక విడుద‌ల తేదీ ప్ర‌క‌టించ‌డం ఓ ఆన‌వాయితీ. సినిమా ప్రారంభంరోజే విడుద‌ల తేదీని ప్ర‌కటించిన మ‌రో ప‌ద్ధ‌తి. మొద‌టి విష‌యంలో చిత్ర యూనిట్‌కి కావాల్సినంత స‌మ‌యం ఉంటుంది. నిలిచి నిదానంగా అన్నిటినీ పూర్తి చేసుకోవ‌చ్చు. కానీ రెండోదాని విష‌యంలో డెడ్‌లైన్ నిత్యం క‌నిపించి ఉరుకులు ప‌రుగులు తీయిస్తుంటుంది. తాజాగా `అర‌వింద‌స‌మేత‌` సినిమా ప‌రిస్థితి అలాగే ఉంది. తార‌క్ హీరోగా న‌టిస్తున్న‌సినిమా ఇది. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ ప‌తాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. తండ్రిని కోల్పోయిన బాధ నుంచి పూర్తిగా తేరుకోని ఎన్టీఆర్ .. వృత్తికి, నిర్మాత‌కు గౌర‌వ‌మిస్తూ సెట్స్ కి చేరుకున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న పార్ట్ ను చిత్రీక‌రిస్తున్నారు. మ‌రోవైపు జ‌రిగినంత మేర ఎడిటింగ్ కూడా చేసేశారు. రీరికార్డింగ్ ని మొద‌లుపెట్టారు. చిన్న‌, స‌న్న ఆర్టిస్టులు డ‌బ్బింగ్ కూడా చెప్పుకుంటున్నారు. సో అన్ని ప‌నులు స‌మాంత‌రంగా జ‌రుగుతున్నాయ‌న్న‌మాట‌. వ‌చ్చే నెల ద‌స‌రా కానుక‌గా ఈ సినిమాను విడుద‌ల చేయాల‌న్న‌ది ప్లాన్‌. అందుకే టీమ్ నిద్రాహారాలు మాని ఉరుకులు ప‌రుగుల మీద ప‌నుల‌ను పూర్తి చేస్తోంది.