close
Choose your channels

మాస్+ యాక్ష‌న్ = 'అర‌వింద స‌మేత' టీజ‌ర్‌

Wednesday, August 15, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మాస్+ యాక్ష‌న్ = అర‌వింద స‌మేత టీజ‌ర్‌

`మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటాదో తెలుసా? ....
మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎలా ఉంటాదో తెలుసా? ...
మట్టి తుఫాను చెవిలో మోగితో ఎట్టుంటాదో తెలుసా?` అని జ‌గ‌ప‌తిబాబు డైలాగ్‌తో మొద‌లైన టీజ‌ర్‌..

`కంట‌బ‌డ్డ‌వా.. క‌నిక‌రిస్తానేమో.. యెంట బ‌డ్డానా న‌రికేస్తాను..` అంటూ ఎన్టీఆర్ డైలాగ్‌తో ముగుస్తుంది.
సాధార‌ణంగా త్రివిక్ర‌మ్ సినిమా అంటే ఫ్యామ‌లీ ట‌చ్ ఉంటుంది. కానీ అర‌వింద స‌మేత ..52 సెకండ్ల నిడివి ఉన్న ఈ టీజ‌ర్ మాస్ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకునేలా ఉంది.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ముచ్చుక‌త్తిని ప‌ట్టుకుని విల‌న్స్ భ‌ర‌తం ప‌డుతుండ‌టం.. చెయిర్‌తో ఠీవిగా విల‌న్‌పై కూర్చుని డైలాగ్స్ చెప్ప‌డం.. చివ‌ర్ల‌లో సిక్స్ ప్యాక్ బాడీలో విల‌న్స్‌ను త‌ర‌మ‌డం.. అన్ని చూస్తుంటే.. ఈసారి త్రివిక్ర‌మ్ ప‌క్కా మాస్ యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ప్రేక్ష‌కుల‌ను, నంద‌మూరి అభిమానుల‌ను మెప్పించేలా ఉంది.

హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని త్రివిక్ర‌మ్ తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 10న విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.