అర‌వింద స‌మేత‌.. టీజ‌ర్‌, ఆడియో ఫంక్ష‌న్ వివ‌రాలు

  • IndiaGlitz, [Friday,July 06 2018]

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న‌ చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. పూజా హెగ్డే, ఈషా రెబ్బా క‌థానాయిక‌లు. త‌మ‌న్ సంగీత ద‌ర్శ‌కుడు. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా కనిపించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా టీజ‌ర్‌ను ఆగ‌స్టు 15న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అలాగే ఆడియో ఫంక్ష‌న్‌ను వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ రెండో వారంలో చేయ‌బోతున్నార‌ని తెలిసింది. మ‌రి ఈ క‌థ‌నాల్లో ఎంత వాస్త‌వ‌ముందో త్వ‌ర‌లోనే తెలుస్తుంది. హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ ప‌తాకంపై ఎస్‌.రాధాకృష్ణ (చిన‌బాబు) నిర్మిస్తున్న ఈ సినిమా విజ‌య ద‌శ‌మి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

More News

అక్కినేని ఫ్యామిలీకి కలిసొచ్చిన స్క్రీన్ నేమ్‌తో చైతు?

'ప్రేమ్‌నగర్', 'అల్లరి అల్లుడు'..  అక్కినేని ఫ్యామిలీకి ఘన విజయాన్ని అందించిన ఈ రెండు సినిమాల్లో ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదేమిటంటే..

నిర్వాణ సినిమాస్ విడుదల చెయ్యనున్న 'మను'

నటుడు బ్రహ్మానందం కుమారుడు గౌతమ్, చాందిని చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన 'మను' సినిమా ప్రముఖ యు.ఎస్ డిస్ట్రిబ్యూట్ సంస్థ నిర్వాణ సినిమాస్ విడుదల చెయ్యబోతోంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న కళ్యాణ్ దేవ్ 'విజేత'

కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన విజేత సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని క్లీన్ యు సట్టిఫికేట్ పొందింది. జులై 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 

హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ '24 కిస్సెస్' ఫస్ట్ లుక్

హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ జంటగా నటించిన '24 కిస్సెస్' సినిమా ఫస్ట్ లుక్ ఇంటర్నేషనల్ కిస్సింగ్ డే (జులై 6) సందర్బంగా విడుదల చేసారు.

కాంట్రాక్ట్ లో సోనీ చరిష్ట

అర్జున్ సర్జా (యాక్షన్ కింగ్ అర్జున్), జె.డి చక్రవర్తి, రాధికా కుమార్ స్వామి (కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య),  సోనీ చరిష్ట ముఖ్య తారాగణంగా రూపొందుతున్న చిత్రం ' కాంట్రాక్ట్ '.