close
Choose your channels

కిషన్‌రెడ్డికి కాల్ చేసి బెదిరించింది వాళ్లేనా!?

Friday, June 14, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కిషన్‌రెడ్డికి కాల్ చేసి బెదిరించింది వాళ్లేనా!?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిన గంగాపురం కిషన్‌రెడ్డి.. లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. పార్టీకి విధేయుడిగా ఉండే కిషన్‌రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా స్థానం కల్పించిన సంగతి తెలిసిందే. అయితే కిషన్‌ రెడ్డిని చంపేస్తామంటూ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అయితే ఈ వ్యవహారమై మంత్రి హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఫోన్‌కాల్స్ ఇంటర్నెట్ వాయిస్ కాల్స్ కావడంతో పోలీసులు ఆ వ్యక్తులెవరో కనిపెట్టేందుకు కాస్త కష్టమైంది.

ఫోన్ చేసి ఏమంటున్నారు..!?

అజ్ఞాత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్‌ రాగానే మిమ్మల్ని చంపేస్తామని అంటున్నారని.. ఇలా తనకు తరుచుగా ఫోన్ కాల్స్ వస్తున్నాయని కిషన్ రెడ్డి చెబుతున్నారు. కాగా.. ఈ మొత్తం వ్యవహారం మే 20 నుంచి జరుగుతోందని మంత్రి చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే కిషన్ రెడ్డి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు నగరంలోని ఆయన ఇంటి వద్ద భద్రత పెంచడం జరిగింది. మరోవైపు కాల్ చేస్తున్న దుండగులెవరో త్వరలో పట్టుకుంటామని పోలీసులు మంత్రికి చెప్పారు.

కిషన్ రెడ్డి గతంలో ఏమన్నారు..!?

కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రిగా బాధ్యత‌లు చేపట్టిన తర్వాత కిషన్ రెడ్డి ఒకింత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నేష‌న‌ల్ సిటిజ‌న్ రిజిస్టర్ త‌యారిపై ప్రధానంగా దృష్టి సారిస్తామని చెప్పి దుమారం రేపారు. ఎవ‌రు ప‌డితే వారు మన దేశంలో ఉండేందుకు ఇదేమి ధ‌ర్మ స‌త్రం కాదని.. భార‌తీయులెవరు? చొర‌బాటుదారులెవ‌ర‌ు? అనేది లెక్క త్వరలోనే తేలుస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ ఉగ్రవాద ఘ‌ట‌న జ‌రిగినా హైద‌రాబాద్‌ను మూలాలుంటున్నాయని, ఉగ్రవాదులు హైద‌రాబాద్‌ను సేఫ్ జోన్‌గా చేసుకుంటున్నారని అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారు.

ఇంతకీ కాల్ చేస్తు్న్నదెవరు!?

ఉగ్రవాదులను పదేపదే హెచ్చరిస్తుండటంతో ఒకవేళ వారి నుంచే కిషన్ రెడ్డికి పదే పదే ఫోన్ కాల్స్ వస్తుండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే పోలీసులు ఈ యాంగిల్‌లో దర్యాప్తు చేస్తారా..? లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఉగ్రమూకలు ఈ మధ్య ఎక్కడపడితే అక్కడ రెచ్చిపోయి విధ్వంసాలు సృష్టించి పైశాచిక ఆనందం పొందుతున్నాయి.

ఈ విచిత్రమేంటో..!

సాధారణ వ్యక్తి ఫిర్యాదు చేస్తే పరిస్థితి వేరేలా ఉండేది.. మరి మంత్రి హోదా ఉన్న వ్యక్తికి ఇలా తరుచూ ఫోన్ కాల్స్ రావడం.. ఈ వ్యవహారంపై సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి కొన్ని గంటలవుతున్నా ఆచూకి కనిపెట్టలేకపోవడం కాసింత చిత్రంగా ఉందని చెప్పుకోవచ్చు. అది కూడా కేంద్ర హోం సహాయ మంత్రి కావడం మరీ విచిత్రంగా ఉందని రాజకీయ విశ్లేషకులు, ప్రత్యర్థులు చెబుతున్నారు. సో.. ఫైనల్‌గా పోలీసులు ఏం తేలుస్తారో..? కాల్ చేస్తున్నది హైదరాబాద్‌కు చెందిన వారా..? లేకుంటే బయటి దేశం నుంచి చేస్తున్నారా..? అన్నది తేలుతుందో లేదో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.