వైసీపీకి టచ్‌లో ఉండే టీడీపీ ఎమ్మెల్యేలు వీళ్లేనా!?

  • IndiaGlitz, [Saturday,June 15 2019]

ఏపీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌‌రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. టీడీపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో వైసీపీ 151 అసెంబ్లీ, 22 ఎంపీ.. టీడీపీ 23 అసెంబ్లీ, 03 పార్లమెంట్ స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అయితే ఈ ఘోర పరాజయం ఎలా జరిగింది..? అని టీడీపీ అధినేత చంద్రబాబు లెక్కలేసుకుంటున్న టైమ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా.. ‘నంబర్ చెప్పను గానీ నాతో టీడీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని.. నేను ఊ అంటే చాలు.. డోర్లు ఓపెన్ చేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు’ అని బాంబు పేల్చిన విషయం విదితమే. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం 08 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ఒకరు రాజ్యసభ ఎంపీ అని చెబుతుండగా.. మరికొందరు మాత్రం 12 మంది ఎమ్మెల్యేలు అని చెబుతున్నారు. దీంతో టీడీపీలో టెన్షన్ మొదలైంది.

అయితే.. ఇంతకీ ఆ ఎమ్మెల్యేలు ఎవరు..? అని తెలుసుకునే పనిలో అధినేత నిమగ్నమయ్యారట. ఈ క్రమంలో కొందరు ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

ఆ ఎనిమిది మంది వీళ్లేనా..!

01. గంట శ్రీనివాస రావు ( వైజాగ్ నార్త్ )
02. అనగాని సత్య ప్రసాద్ (రేపల్లె )
03. బాల వీరాంజనేయ స్వామి (కొండెపి )
04. గొట్టిపాటి రవి కుమార్ (అద్దంకి)
05. రామరాజు మంతెన (ఉండీ)
06. వేగుళ్ల జోగేశ్వర రావు (మండపేట )
07. రామకృష్ణ బాబు వెలగపూడి (వైజాగ్ ఈస్ట్ )
08. బండారు మాధవ నాయుడు (పాలకొల్లు )

పైన చెప్పిన వీళ్ళందరూ వైస్సార్సీపీ పార్టీలోని కొందరు ముఖ్యనేతలతో టచ్‌లో ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాదు.. ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన భూమా, జేసీ కుటుంబాలతో జిల్లాలను ఏలిన రాజకీయ కుటుంబాలు కూడా వైసీపీ కీలకనేతలతో టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళని మందలించటం కంటే కూడా బుజ్జిగించటమే బెటర్ అనే ఆలోచనలో బాబు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ బాబు ఎంత బుజ్జగించిన కానీ, జగన్ సైగ చేస్తే వెళ్లిపోవటానికి రెడీగా ఉన్నారట. అంతేకాదు.. తమ పదవులకు సైతం రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారట. అయితే ఈ విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే మరి.

More News

చంద్రబాబును తనిఖీలు చేస్తే తప్పేంటి..!?

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్టులో భద్రతా సిబ్బంది తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే.

విజయ్ ఆంటోనీ చేతుల మీదుగా 'మళ్ళీ మళ్ళీ చూశా'సాంగ్ విడుదల..!!

అనురాగ్ కొణిదెన, శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరో హీరోయిన్లు గా హేమంత్ కార్తీక్ దర్శకత్వంలో క్రిషి క్రియేషన్స్ పతాకంపై కె. కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం "మళ్ళీ మళ్ళీ చూశా"..

నేపాల్‌కు స‌న్నీలియోన్ సెగ‌

శృంగార‌తార స‌న్నీలియోన్ ఇండియ‌న్ సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్స్‌లోనే కాదు.. ప్ర‌త్యేక పాత్ర‌లు, కీల‌క పాత్ర‌ల్లోనూ న‌టిస్తూ మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది.

చంద్రబాబుకు శాపం తగిలింది.. అందుకే ఓటమి!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఎవరూ ఊహించని రీతిలో వైసీపీ మెజార్టీ సీట్లు దక్కించుకోగా.. జనసేన తరఫున పోటీచేసిన వారిలో ‘ఒకే ఒక్కడు’ గెలిచారు.

హైదరాబాద్‌లో అర్ధరాత్రి నడిరోడ్డుపై క్లబ్‌ డ్యాన్సర్‌ బట్టలు విప్పి...!!

తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై అరాచకాలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో షీటీమ్స్ అంటూ పోలీసులు కొత్త ప్రయోగాలు చేసినప్పటికీ ఆడపిల్లలపై దాడులు మాత్రం ఆగట్లేదు.