Ari: 'అరి' మూవీ క్యారెక్టర్ ఫస్ట్ లుక్స్

  • IndiaGlitz, [Friday,October 14 2022]

అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, సుమన్, ఆమని, శ్రీకాంత్ అయ్యంగార్, వైవాహర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా అరి. మై నేమ్ ఈజ్ నో బడీ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాకు పెట్టుకున్న బ్యాడ్ ఈజ్ న్యూ గుడ్ అనే క్యాప్షన్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఉంది. ఈ చిత్రాన్నిఆర్వీ రెడ్డి సమర్పణలో అర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు. పేపర్ బాయ్ సినిమా ద్వారా ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న జయశంకర్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలోని ఒక్కో పాత్రను రివీల్ చేస్తున్నారు.

ఈ క్యారెక్టర్స్ ఫస్ట్ లుక్స్, వాటి పేర్లు వైవిధ్యంగా ఉండి సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. జలసీ పాత్రలో అనసూయ, ప్రైడ్ గా సాయి కుమార్, ఆంగర్ క్యారెక్టర్ లో శ్రీకాంత్ అయ్యంగార్, లస్ట్ గా వైవా హర్ష, గ్రీడీ పాత్రలో శుభలేఖ సుధాకర్, అటాచ్ మెంట్ క్యారెక్టర్ లో సురభి ప్రభావతి నటిస్తున్నారు. వీరి క్యారెక్టర్ ఫస్ట్ లుక్స్ కొత్తగా ఉన్నాయి. మనిషి ఎలా బతకకూడదు అనే విషయాన్ని ఈ సినిమా ద్వారా ఆసక్తికరంగా చూపిస్తున్నారు. ప్రస్తుతం అరి సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.

సాంకేతిక నిపుణులు: రచన – దర్శకత్వం :జయశంకర్, సమర్పణ : ఆర్వీ రెడ్డి, నిర్మాతలు :శ్రీనివాస్ రామిరెడ్డి , శేషు మారం రెడ్డి , సంగీతం : అనుప్ రూబెన్స్

నటీనటులు: అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర, శుభలేక సుధాకర్, సురభి ప్రభావతి, తమిళ బిగ్ బాస్ పావని రెడ్డి, జెమినీ సురేష్, ఐ డ్రీమ్ అంజలి, మనిక చిక్కాల, సుమన్, ఆమని, ప్రవళ్లిక చుక్కల, సురభి విజయ్ తదితరులు

More News

Michael: సందీప్ కిష‌న్‌ ‘మైఖేల్’ టీజర్ అక్టోబర్ 20 న విడుదల

వెర్సటైల్ స్టార్ సందీప్ కిషన్  తొలి పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’ రంజిత్ జయకోడి దర్శకత్వంలోభారీ యాక్షన్ ఎంటర్‌టైనర్  గా

BiggBoss: త్యాగం చేసి ఫూల్ అయిన రోహిత్, ఒకే లాలీపాప్‌తో ఇనయా- సూర్య రాసలీలలు

ప్రస్తుతం బిగ్‌బాస్‌లో సర్‌ప్రైజ్ టాస్క్ నడుస్తోన్న సంగతి తెలిసిందే.

Chiranjeevi: 'గాడ్ ఫాదర్' చిత్రం విజయం మరిన్ని వైవిధ్యమైన పాత్రలు చేయలనే ఉత్సాహాన్ని ఇచ్చింది: మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి నటించిన  ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'గాడ్ ఫాదర్.

Aadi Saikumar: మంచి ఎంటర్ టైనర్ సినిమా.. ఆడియన్స్ కి  'క్రేజీ ఫెలో' ఖచ్చితంగా నచ్చుతుంది : ఆది సాయికుమార్‌

మంచి స్క్రిప్ట్‌లు ఎంపిక చేసుకుంటూ, విభిన్నమైన సినిమాలు రూపొందించే నిర్మాత కె.కె.రాధామోహన్‌.

BiggBoss: ‘‘వెర్రిపప్ప’’ అయిన శ్రీహాన్.. మారని అర్జున్, గీతూకు గడ్డిపెట్టిన తండ్రి

నామినేషన్స్ తర్వాతి రోజు నుంచి గొడవలు, గలాటాలతో దబిడి దబిడే అనుకుంటే ...