అర్జున్ రెడ్డి మరో వివాదం...

  • IndiaGlitz, [Wednesday,August 30 2017]

అర్జున్ రెడ్డి విడుద‌ల‌కు ముందుగానే లిప్‌లాక్‌పై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి.హ‌నుమంత‌రావు వివాదం మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే. సినిమా వివాదాల‌కు అతీతంగా విడుద‌లై సెన్సేష‌న‌ల్ హిట్ సాధించింది. నిన్న కూడా హ‌నుమంత‌రావు అర్జున్ రెడ్డి సినిమా ద్వారా యువ‌త‌కు ఏం చెప్పాల‌నుకుంటున్నారు. యువ‌త‌ను డ్ర‌గ్స్‌, మందుకు బానిస అమ‌మ‌ని సందేశం ఇవ్వాల‌నుకుంటున్నారా అని అన‌డ‌మే కాదు. తెలంగాణ సీ.ఎం, హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఓకే కులానికి చెందిన‌వారు కావ‌డంతో మంత్రి కె.టి.ఆర్‌. సినిమాకు స‌పోర్ట్ చేస్తున్నార‌ని అన్నారు.

అయితే దీనిపై విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రోసారి సోష‌ల్ మీడియా ద్వారా జవాబిచ్చాడు. 'డియర్‌ తాతయ్య.. అర్జున్‌ రెడ్డి బాగుందన్న కేటీఆర్‌ నాకు బంధువైనప్పుడు.. ఎస్‌.ఎస్‌ రాజమౌళి నాకు తండ్రి అవుతారు. రానా దగ్గుబాటి, నాని, వరుణ్‌తేజ్‌, శర్వానంద్‌లు సోదరులవుతారు. నాకు అక్కాచెల్లెళ్లు లేరు కాబట్టి ఆ ఫీలింగ్‌ ఎలా ఉంటుందో తెలీదు. అందుకే సమంత, అను ఇమ్మాన్యుయేల్‌, మెహరీన్‌ నా మరదళ్లు. ఐదు రోజుల్లో నా సినిమాను సూపర్‌హిట్‌ చేసిన విద్యార్థులు, అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ నాకు కవలలు. కానీ వర్మ మాత్రం మన ఇద్దరిలో ఎవరికి తండ్రో క్లారిటీ లేదు... తాతయ్యా చిల్‌' అంటూ స‌మాధాన‌మిచ్చాడు.
అయితే ఈ వివాదం కాకుండా ఖ‌మ్మం జిల్లాకు చెందిన డి.నాగరాజు అనే వ్య‌క్తి త‌ను డైరెక్ట్ చేసిన ఇక సె..ల‌వ్ సినిమా క‌థ‌ను ఆధారంగా చేసుకుని అర్జున్ రెడ్డి సినిమాను రూపొందించార‌ని, త‌న అనుమ‌తి తీసుకోలేద‌ని, త‌న‌కు క‌లిగిన న‌ష్టానికి వారంలోగా రెండు కోట్ల రూపాయలు ఇవ్వాల‌ని లేని ప‌క్షంలో చ‌ట్ట ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని నోటీసులిచ్చాడ‌ట‌.

More News

థమన్ కి ఇదో అనుభవం

సరైనోడు తరువాత సరైన విజయమేదీ సంగీత దర్శకుడు థమన్ ఖాతాలో చేరలేదు.

'జై లవకుశ' ఆడియో క్యాన్సిల్...

ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'జై లవకుశ'.

సెప్టెంబర్ 1న 'రథావరం' వస్తోంది!

ధర్మశ్రీ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై శ్రీ మురళి,రచితారామ్ జంటగా మంజునాథ్.ఎన్ నిర్మించిన కన్నడ చిత్రాన్ని తెలుగులో

హీరోయిన్స్ వరకు ఓకే..కానీ?

శ్రీ సూర్య మూవీస్..ఈ పేరు వింటే ఒకప్పుడు హిట్ సినిమాలే గుర్తొచ్చేవి.

విజయ్ దేవరకొండ కి కలిసొస్తున్న సెకండాఫ్

నాని నటించిన ఎవడే సుబ్రమణ్యంతో నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ..