close
Choose your channels

BiggBoss: ఆరోహి ఎలిమినేట్.... హౌస్‌లో స్వచ్ఛమైన మనిషులు వాళ్లేనంటూ కామెంట్స్

Monday, October 3, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అనుకున్నదే అయ్యింది బిగ్‌బాస్ నుంచి ఈ వారం ఆరోహి ఎలిమినేట్ అయ్యింది. కెమెరా స్పేస్‌కి అస్సులు ప్రయత్నించకపోవడం, తక్కువ ఓటింగ్ కారణంగా ఆమె ఎలిమినేట్ అవ్వకతప్పదని గత కొన్నిరోజులుగా జరుగుతున్న ప్రచారమే నిజమైంది. ఉత్కంఠభరితంగా సాగిన ఎలిమినేషన్ రౌండ్‌లో ఆరోహి ఇంటిని వీడక తప్పలేదు. దసరా పండుగను పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచే స్పెషల్ షోని ప్లాన్ చేశారు నిర్వాహకులు. పండుగ కావడంతో నాగార్జున అలరించే ప్రయత్నం చేశారు. సరదా ఆటలు ఆడిస్తూ మధ్యలో ఒక్కొక్కరిని సేవ్ చేసే ప్రయత్నం చేశారు. కంటెస్టెంట్స్ చేత టెంకాయిలు కొట్టించారు. వాటిలో ఒక చీటి వుంచి.. సేఫ్, అన్ సేఫ్ అని రాశారు. ఇందులో శ్రీహాన్‌కు సేఫ్ చీటి రావడంతో సేవ్ అయినట్లు ప్రకటించారు నాగార్జున.

ఇక ఒక సందర్భంలో గీతూపై సీరియస్ అయ్యారు నాగ్. హౌస్‌లో బాగా ఆడని ఆదిరెడ్డి, బాలాదిత్య, చంటి, ఇనయాలలో ఒకరిని ఎన్నుకోమని చెప్పగా... వీరిలో ఎక్కువ ఓట్లు చంటికి రావడంతో అతనిని ఈ సీజన్ మొత్తానికి కెప్టెన్ టాస్క్‌లో పాల్గొనకుండా అనర్హత వేశారు. అయితే కెప్టెన్ కీర్తి తన ఓటు చంటికే వేయడం వల్లే అతనికి శిక్ష పడింది. వీరిద్దరి మధ్య చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ రావడంతో ... దానిని నాగ్ సరిదిద్దే ప్రయత్నం చేశారు. కీర్తి కెమెరాలో కనపడేందుకే పనిచేస్తుందని చంటి అన్న మాటలను గీతూ తప్పుగా చెప్పడం వల్లే అసలు గొడవ జరిగిందని నాగ్ చెప్పాడు. ఈ మధ్యలో గీతూ మాట్లాడేందుకు పైకి లేవడంతో నాగ్ సీరియస్ అయ్యారు.. ఫస్ట్ సీడౌన్... నేను మిగిలిన వాళ్లను ఏమైనా అడిగేటప్పుడు మధ్యలో దూరుతున్నావ్, నీకు ఇది బాగా అలవాటు అయిపోయింది అంటూ క్లాస్ పీకారు. తర్వాత జరిగిన దానికి తన వర్షెన్ చెబుతూ.. గీతూ కంటతడి పెట్టింది, చివరికి చంటికి కీర్తి క్షమాపణలు చెప్పింది.

తర్వాత ది ఘోస్ట్ మూవీ టీమ్ బిగ్‌బాస్ స్టేజ్ మీదకు అడుగుపెట్టింది. డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు, హీరోయిన్ సోనాల్ చౌహాన్‌లు హౌస్‌మేట్స్‌తో కాసేపు ముచ్చటించి, సరదాగా గేమ్ ఆడించారు. హౌస్ లో ఉన్న ఈవిల్ ఎవరో.. వారిని షూట్ చేయాలని ఘోస్ట్ టీమ్ చెప్పింది. ఇందులో ఫైమా.. కీర్తిని, గీతూ.. చంటిని.. ఆదిరెడ్డి.. రేవంత్ ను, రేవంత్.. కీర్తిను, కీర్తి.. రేవంత్ ను, చంటి.. రేవంత్ ను, ఆర్జే సూర్య.. ఆరోహిను, రాజ్.. గీతూని, మెరీనా.. గీతూని, ఆరోహి.. ఇనయాను, ఇనయా.. శ్రీహాన్ ను, సుదీప.. బాలాదిత్యను, బాలాదిత్య.. గీతూని, అర్జున్.. శ్రీసత్యను, శ్రీహాన్.. కీర్తిను, శ్రీసత్య.. ఆర్జే సూర్యను షూట్ చేశారు.

ఈ గేమ్ తర్వాత నామినేషన్స్ వున్నవాళ్లకు పూల బుట్టలు ఇచ్చారు. ఇందులో ఇనయాకు సేఫ్ అని రావడంతో ఆమె సేవ్ అయినట్లు ప్రకటించారు. అనంతరం ది ఘోస్ట్ టీమ్‌కు వీడ్కోలు చెప్పి.. ఇంటి సభ్యుల్లోని అబ్బాయిలు, అమ్మాయిలను వేరు చేసి ఆటలు ఆడించారు. తర్వాత ఒక్కో పెట్టే చేతికి ఇచ్చి... ఇందులో రేవంత్ సేఫ్ అయినట్లు ప్రకటించారు. ఆపై నామినేషన్స్‌లో వున్న ఒక్కొక్కరికి ఒక గంట చేతికి ఇచ్చాడు నాగ్.. ఇందులో గంట మోగించిన గీతూ సేఫ్ అయ్యింది. అలా వరుసగా ఆర్జే సూర్య, కీర్తి, అర్జున్‌‌, రాజ్‌లను నాగార్జున సేఫ్ చేశారు. ఇక ఫైనల్‌గా సుదీప, ఆరోహిలు మాత్రమే మిగిలారు. దీంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది.

స్టేజ్‌పై రెండు కుండలు వుంచి.. వాటిలో నీళ్లు పోశాడు నాగ్... వీటిలో నుంచి ఎవరి కుండలోంచి రెడ్ కలర్ వస్తుందో వారు ఎలిమినేట్ అవుతారని చెప్పాడు. ఆరోహి కుండలో నుంచి ఎరుపు రంగు రావడంతో ఆమె ఈ వారం ఎలిమినేట్ అయినట్లు నాగ్ ప్రకటించారు. దీంతో హౌస్ మొత్తం నిశ్శబ్ధంగా మారింది. దీనిని ఊహించని ఇనయా, కీర్తి, ఆర్జే సూర్య బాగా ఏడ్చారు. అనంతరం స్టేజ్ మీదకు వచ్చిన ఆరోహీకి నాగార్జున..ఇంటిలో స్వచ్ఛమైన వారు ఎవరు...? కల్మషం వున్న వారు ఎవర చెప్పాలని టాస్క్ ఇచ్చాడు. ఈ సందర్భంగా శ్రీహాన్, బాలాదిత్య, కీర్తి, ఆర్జే సూర్య, వాసంతి, మెరీన్ రోహిత్‌లను స్వచ్ఛమైన మనుషులని... రేవంత్ , చంటి, సుదీప, శ్రీసత్య, ఇనయా, గీతూలకు కల్మషం ట్యాగ్ ఇచ్చింది ఆరోహి. అందరి గురించి పాజిటివ్‌గానే చెప్పిన ఆమె.. బయటకు వచ్చాక కలుద్దామని చెప్పింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.