రాధికా శ‌ర‌త్‌కుమార్ ను అరెస్ట్ చేయండి

  • IndiaGlitz, [Tuesday,July 02 2019]

రాధికా శ‌ర‌త్‌కుమార్‌ను అరెస్ట్ చేయాల‌ని చెన్నై సైదాపేట కోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఓ చెక్కు బౌన్స్ కేసులో వారిరువురి మీద కేసు రిజిస్ట‌ర్ అయింది. ప‌లుమార్లు ఉత్త‌ర్వులు జారీ చేసినా కోర్టుకు వారిద్ద‌రు హాజ‌రు కాక‌పోవ‌డంతో ఆగ్ర‌హం చెందిన కోర్టు ఇప్పుడు వారిని అరెస్ట్ చేయాల‌ని ఉత్త‌ర్వులు జారీ చేసింది.

వివ‌రాల్లోకెళ్తే, మ‌ల‌యాళ నిర్మాత లిస్టిన్ స్టీఫెన్‌తో క‌లిసి రాధికా, శ‌ర‌త్‌కుమార్ ప‌లు సినిమాల‌ను నిర్మించారు. మేజిక్ ఫ్రేమ్స్ బ్యాన‌ర్ మీద వాళ్లు నిర్మించిన 'చెన్నైయిల్ ఒరు నాళ్‌', 'మారి' వంటివ‌న్నీ ఆ త‌ర‌హా చిత్రాలే. ఈ సినిమాల కోసం రేడియ‌న్స్ మీడియా ద‌గ్గ‌ర నిర్మాత‌లు రూ.2కోట్లు అప్పు తీసుకున్నారు. ఈ రుణాన్ని తీర్చ‌డం కోసం రాధికా శ‌ర‌త్‌కుమార్ చెక్కు ఇచ్చారు. అయితే అది బౌన్స్ అయింది. దాంతో రాధికా, శ‌ర‌త్‌కుమార్ మీద రేడియ‌న్స్ మీడియా హౌస్ కేసు ఫైల్ చేసింది. దీనికి సంబంధించి ప‌లు హియ‌రింగ్‌ల‌కు హాజ‌రు కావాల‌ని దంప‌తుల‌కు నోటీసులు అందాయి. కానీ వాళ్లు దాన్ని ప‌ట్టించుకోలేదు. దీంతో ఆగ్ర‌హం చెందిన కోర్టు హియ‌రింగ్‌ను ఈనెల 12కు పోస్ట్ పోన్ చేసి దంప‌తుల‌ను అరెస్ట్ చేయాల‌ని పోలీసుల‌కు సూచించింది.

 
 

More News

ఎవరిపైనా మాకు కక్ష లేదు.. ఆకస్మిక తనిఖీలుంటాయ్!

కాంట్రాక్టర్లను వేధించడం తమ ఉద్దేశం కాదని, ఎవరిపైనా మా ప్రభుత్వానికి కక్ష లేదని సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం నాడు గృహనిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించారు.

మెగా హీరోల‌కు రాయ‌ల‌సీమ‌లో పోరు

మెగా హీరోల‌కు రాయ‌ల‌సీమ వాసుల‌తో పోరు త‌ప్ప‌డం లేదు. మెగా హీరో రామ్ చ‌ర‌ణ్ ఆఫీస్ ముందు ఇటీవ‌ల ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి సంత‌తి వ‌చ్చి గొడ‌వ చేసిన విష‌యం తెలిసిందే.

బాలయ్యను ఫాలో అవుతున్న బీజేపీ ఎంపీ.. అధిష్టానం ఆగ్రహం!

ఓహ్.. బీజేపీ ఎంపీ.. అది కూడా మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీ కాకుండా ఇంకెవరో బాలయ్యను ఫాలో అవుతున్నారంటే ఆషామాషీ విషయమేం కాదు.

లోక్‌సభలో మోదీ సర్కార్‌ను తూర్పారబెట్టిన సోనియా!

రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత బీజేపీ చేస్తున్న కొన్ని పనులు ప్రతిక్షాలకు రుచించట్లేదు. పార్లమెంట్ సమావేశాల వేదికగా..

‘సుమలత’ తొలి ప్రసంగానికి లోక్‌సభ ఫిదా.. మోదీ పరిష్కరిస్తారా!?

కర్ణాటక సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్‌పై మాండ్యా నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసిన సినీ నటి సుమలత ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.