యమునా నది తీరంలో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు

  • IndiaGlitz, [Sunday,August 25 2019]

కమల దళంలో ట్రబుల్‌ షూటర్‌‌, కేంద్ర మాజీ మంత్రి, మోదీ-షాలకు రైట్ హ్యాండ్‌గా పేరుగాంచిన అరుణ్‌జైట్లీ అంత్యక్రియలు నేడు 2:30 గంటలకు యమునానది తీరంలోని నిగంబోధ్‌ ఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. జైట్లీ పార్థీవ దేహాన్ని మరికాసేపట్లో అనగా 1:30 గంటల వరకు కేంద్ర కార్యాలయంలో అభిమానులు, కార్యకర్తలు, నేతలు కడసారి చూసేందుకు ఉంచుతారు. అనంతరం కార్యాలయం నుంచి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది.

ఇదిలా ఉంటే.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు, దేశ వ్యాప్తంగా ఉన్న పలు పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు, రాజకీయ ఉద్ధండులు జైట్లీ భౌతిక కాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కాగా.. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అరుణ్‌ జైట్లీ శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన విషయం విదితమే.

More News

‘సాహో’ స్టోరీ తెలిసిపోయిందోచ్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్దా కపూర్ నటీనటులుగా సుజిత్ తెరకెక్కించిన చిత్రం ‘సాహో’. రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఆగస్టు 30న అభిమానుల ముందుకు రాబోతోంది.

అక్బరుద్దీన్ పైకిపోతేనే బెటర్.. ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రులు చుట్టూ తిరుగుతున్నారు.

‘రైతు’ కానున్న ‘రణరంగం’ హీరో!

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ విభిన్న పాత్రల్లో చేస్తుంటారన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా లవ్ స్టోరీ రిలేటెడ్ కథల్లో ఎక్కువగా నటిస్తుంటారు.

జగన్ చెప్పలేదుగా అమరావతిపై ఆందోళన వద్దు!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని తరలిస్తారని గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో కోడై కూస్తున్న సంగతి తెలిసిందే.

ఒకే ఏడాదిలో ఐదుగురి ఉద్దండులను కోల్పోయిన బీజేపీ

బీజేపీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. 2019 ఏడాదిలోనే ఎంతో మంది ఉద్ధండులను బీజేపీ కోల్పోవడం గమనార్హం.