close
Choose your channels

లక్ష్మీదేవి మీ ఇంట అడుగుపెట్టినట్టే: మంచు విష్ణు

Friday, August 9, 2019 • తెలుగు Comments

లక్ష్మీదేవి మీ ఇంట అడుగుపెట్టినట్టే: మంచు విష్ణు

శ్రావణ శుక్రవారాన్ని మన హిందువులు చాలా పవిత్రంగా, విశిష్టమైనరోజుగా భావిస్తుంటారు. ఈరోజున మంచువారి ఫ్యామిలీ ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే మంచు విష్ణు సతీమణి విరోనికా ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా తెలిపారు. సోషల్ మీడియాలో అందరూ మంచు విష్ణుకి అభినందనలు తెలుపుతున్నారు. `వరలక్ష్మివ్రతం రోజున ఆడపిల్ల పుట్టింది. కాబట్టి ఆ లక్ష్మీదేవి మీ ఇంట కూడా అడుగుపెట్టినట్లే` అన్నారు. విష్ణు, విరోనికా దంపతులకు అరియానా, వివియానా, అవ్రామ్ లు ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే హీరోగా, నిర్మాతగా మంచు విష్ణు ప్రేక్షకులను పలకరించబోతున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz