100 డేస్.. 4 షోలతో ఫుల్.. వరల్డ్ రికార్డ్ : అశ్వనీదత్ 

  • IndiaGlitz, [Sunday,May 19 2019]

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పూజా హెగ్దే నటీనటులుగా వంశీపైడిపల్లి తెరకెక్కించిన చిత్రం ‘మహర్షి’. మే-09న విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టయ్యింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే సక్సెస్ మీట్ పూర్తి చేసుకున్న ‘మహర్షి’.. శనివారం రోజున విజయవాడలోని సిద్ధార్థ కాలేజీలో గ్రాండ్ సక్సెస్ మీట్ చేసుకుంటున్నాడు. ఈ కార్యక్రమంలో నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

వరల్డ్ రికార్డ్ అంతే..!

సూపర్‌స్టార్ కృష్ణ, మహేశ్ అభిమానులందరికీ ధన్యవాదాలు.. నేను, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో మహేష్ బాబుతో తీసిన మొదటి సినిమా రాజకుమారుడు ఈ విజయవాడ అలంకార్ ధియేటర్ లో 100 రోజులు 4 షోలతో ఫుల్ అయ్యి వరల్డ్ రికార్డ్ సృష్టించింది.

మళ్లీ ఈ రోజు నా సోదరులు గొప్ప నిర్మాతలతో కలిసి తీసిన మహర్షి రికార్డులు సృష్టిస్తోంది. మాకు ఇంత గొప్ప చిత్రాన్ని అందించిన వంశీ పైడిపల్లికి.. సాంకేతిక నిపుణులు, హీరోయిన పూజా హెగ్దేకు ధన్యవాదాలు. అన్నింటికీ మించి మా సూపర్ స్టార్ మహేశ్‌ బాబుకు ధన్యవాదాలు అని అశ్వనీదత్ చెప్పుకొచ్చారు.

అశ్వనీ దత్ మాట్లాడుతున్నంత సేపు మహేశ్, పైడిపల్లి ఇద్దరూ ఆయనవైపే తథేకంగా చూడసాగారు. మరో వైపు అభిమానులు ఈలలు, కేకలతో హోరెత్తించారు. జై బాబు .. జై బాబు.. జై సూపర్ స్టార్ అంటూ సభా ప్రాంగణంలో నినాదాలు చేస్తూ మార్మోగించారు.

More News

మెగా హీరో విష‌యంలో చేతులెత్తేసిన దేవి

రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్‌కి, మెగా ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధ‌మో.. అలా కుదురుతుందేమో కానీ

‘పోకిరి’ని మించిపోతుందని.. షూటింగ్ ఫస్ట్ రోజే చెప్పా..!  

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పూజా హెగ్దే నటీనటులుగా వంశీపైడిపల్లి తెరకెక్కించిన చిత్రం 'మహర్షి'. మే-09న విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టయ్యింది.

దర్శకేంద్రుడి మాటలకు దణ్ణం పెట్టిన మహేశ్, వంశీ.

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పూజా హెగ్దే నటీనటులుగా వంశీపైడిపల్లి తెరకెక్కించిన చిత్రం 'మహర్షి'. మే-09న విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టయ్యింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

ట్రెండ్ సెట్టర్‌గా మారిన 'మహర్షి'.. రైతులకు సన్మానం

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పూజా హెగ్దే నటీనటులుగా వంశీపైడిపల్లి తెరకెక్కించిన చిత్రం ‘మహర్షి’. మే-09న విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టయ్యింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

గజిబిజీ తీర్పు కాదు.. ఏపీలో హంగ్ రాదు: లగడపాటి 

ఆంధ్రా ఆక్టోపస్, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అప్పుడెప్పుడో తెలంగాణ ఎన్నికల్లో దర్శనమిచ్చి తాజాగా ఏపీ ఎన్నికల ఫలితాలు దగ్గరపడుతుండటంతో మరోసారి మీడియా ముందుకు వచ్చి హడావుడి చేస్తున్నారు.