ఏడెనిమిది సంవత్సరాల్లో 'ఊపిరి' లాంటి గొప్ప సినిమా నేను చూడలేదు - మెగా ప్రొడ్యూసర్‌ సి.అశ్వనీదత్‌ 

  • IndiaGlitz, [Monday,April 04 2016]

కింగ్‌ నాగార్జున, ఆవారా కార్తీ, మిల్కీబ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో పెరల్‌ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె నిర్మించిన ఫీల్‌ గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'ఊపిరి'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌తో ప్రపంచ వ్యాప్తంగా అఖండ విజయం సాధించి యు.ఎస్‌.లో 2 మిలియన్‌ డాలర్లు కలెక్ట్‌ చేసే దిశగా వెళుతోంది. 41 ఏళ్ళ కెరీర్‌లో నాటి 'ఎదురులేని మనిషి' నుంచి నిన్నటి 'ఎవడే సుబ్రహ్మణ్యం' వరకు ఎన్నో అఖండ విజయాలు అందుకున్న భారీ చిత్రాల నిర్మాత, మెగా ప్రొడ్యూసర్‌ వైజయంతి మూవీస్‌ అధినేత సి.అశ్వనీదత్‌ 'ఊపిరి' చిత్రాన్ని చూసి తన స్పందనను తెలియజేశారు.

''ఈ ఏడెనిమిది సంవత్సరాల్లో ఇంత గొప్ప సినిమా నేను చూడలేదు. ఒక విభిన్నమైన కథాంశంతో ఎంతో లావిష్‌గా అద్భుతంగా ఈ సినిమా తీసిన పి.వి.పి.గారి టేస్ట్‌కి హ్యాట్సాఫ్‌. నా తరం నిర్మాతలందరూ గర్వపడే చిత్రం 'ఊపిరి'. 'గీతాంజలి' తర్వాత నాగార్జున ఎంతో గొప్పగా నటించిన సినిమా 'ఊపిరి'. నాగార్జున అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్‌కి బ్యాలెన్స్‌డ్‌గా కార్తీ కూడా ఎంతో బాగా చేశాడు. ఇంతకుముందు వంశీ పైడిపల్లి డైరెక్ట్‌ చేసిన సినిమాలు చూసి మామూలు దర్శకుడు అనుకున్నాను. కానీ, 'ఊపిరి' చూసిన తర్వాత వంశీ ఒక గొప్ప దర్శకుడు అని ఫీల్‌ అయ్యాను. 'ఊపిరి' చిత్రాన్ని వంశీ మలచిన తీరు అద్భుతం. ఈ సినిమా అఖండమైన విజయాన్ని సాధించినందుకు సాటి నిర్మాతగా నేనెంతో ఆనందిస్తున్నాను. 'ఊపిరి'లాంటి మంచి సినిమాని తీసిన పి.వి.పి. యూనిట్‌ మొత్తానికి నా అభినందనలు తెలియజేస్తున్నాను'' అన్నారు.

More News

మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విశాఖపట్నంలో సరైనోడు ఆడియో సెలబ్రేషన్స్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్ లో అత్యంతభారీగా నిర్మించిన సరైనోడు చిత్రం ఆడియో ఏప్రిల్ 1న విడుదలయ్యి అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పోందుతుంది.

ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించిన ప్రియాంక చోప్రా..

అందం - అభిన‌యం తో పాటు ఆత్మ‌విశ్వాసాని మ‌రో పేరులా ఉండే బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా...ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించిందా..? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా..? ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా మూడు సార్లు ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించింద‌ట ప్రియాంక‌.

బాలయ్యతో సన్నీ...?

నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన వందవ చిత్రం చిత్రీకరణకు సంబంధించి బిజీగా ఉన్నాడు.

సిద్ధార్థ్ కమ్ బ్యాక్....

తెలుగులో బొమ్మరిల్లు తర్వాత మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో సిద్ధార్థ్ తెలుగులో తర్వాత వరుసగా అనుకున్న

చిరంజీవి 150వ సినిమా టైటిల్...

మెగాస్టార్ చిరంజీవి సినీ రంగ ప్రవేశం ఇటు అభిమానుల్లో అటు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిని రేపింది.