అసిన్ పెళ్లి అయ్యింది..

  • IndiaGlitz, [Tuesday,January 19 2016]

అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన అందాల భామ అసిన్. గ‌జిని, శివ‌మ‌ణి, ల‌క్ష్మి న‌ర‌సింహా త‌దిత‌ర చిత్రాల్లో న‌టించిన అసిన్ ఈరోజు పెళ్లి చేసుకుంది. మైక్రో మ్యాక్స్ అధినేత రాహుల్ శ‌ర్మ‌తో అసిన్ వివాహాం ఈరోజు ఉద‌యం న్యూఢీల్లోని ఓ చ‌ర్చిలో జ‌రిగింది.
అసిన్ అక్ష‌య్ కుమార్ తో క‌ల‌సి ఆల్ ఈజ్ వెల్ అనే సినిమాలో న‌టించింది. ఈ సినిమా టైంలోనే రాహుల్ శ‌ర్మ‌తో ప‌రిచ‌యం కావ‌డం..ఆ ప‌రిచ‌యం కాస్త ప‌రిణ‌యానికి దారి తీయ‌డం జ‌రిగింది. ఈ రోజు ఉద‌యం క్రైస్త‌వ మ‌త ఆచారం ప్ర‌కారం పెళ్లి చేసుకున్న అసిన్ ఈరోజు సాయంత్రం హిందు మ‌త సంప్ర‌దాయం ప్ర‌కారం రాహుల్ శ‌ర్మ‌, అసిన్ ఒక్క‌ట‌వ‌నున్నారు.
ఈ వేడుక‌కు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు హాజ‌రుకానున్నారు.

More News

న్యూలుక్ తో సర్ ఫ్రైజ్ చేస్తున్న చిరు..

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకి..డైరెక్టర్ వినాయక్, నిర్మాత చరణ్, కత్తి రీమేక్... అంటూ.. గత కొన్నిరోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవల డైరెక్టర్ వి.వి.వినాయక్ తూర్పుగోదావరి జిల్లా పాశర్లపూడిలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు.

నటుడుగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నా... సంత్రుప్తి లేదు - రెబల్ స్టార్ క్రిష్ణంరాజు

కథానాయకుడుగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా...నిర్మాతగా.. రాజకీయ నాయకుడుగా..ఇలా తను ప్రవేశించిన ప్రతి రంగంలో విజయం సాధించిన సీనియర్ హీరో రెబల్ స్టార్ క్రిష్ణంరాజు. చిలకా గోరింక సినిమాతో కెరీర్ ప్రారంభించిన క్రిష్ణంరాజు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి మెప్పించారు.

'ఊపిరి' రిలీజ్ డేట్...

ఫ్రెంచ్ మూవీ 'ది ఇన్ టచబుల్స్' కి రీమేక్ గా 'ఊపిరి' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.నాగార్జున,కార్తీ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ కాగా..

నవీన్ రోల్ ఏంటంటే...

నవీన్ చంద్ర ,లావణ్య త్రిపాఠి జంటగా మయూఖ క్రియేషన్స్ బ్యానర్ పై జగదీష్ తలశిల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'లచ్చిందేవికి ఓ లెక్కుంది'.

ఎన్టీఆర్ ను అభినందించిన చరణ్...

సంక్రాంతి పండుగ లో విడుదలైన చిత్రాల్లో ‘నాన్నకు ప్రేమతో…’డిఫరెంట్ సినిమాగా మంచి పేరుని ఈ సినిమా సంపాదించుకుంది.