తెలుగు మహాసభలకు రండి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ‘‘ఆటా’’ ఆహ్వానం

అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ 17వ మహాసభలు అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో జూలై 1 నుంచి 3 వరకు జరగనున్నాయి. ఈ స‌భ‌లకు హాజరు కావాల్సిందిగా బీజేపీ నేత, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ మేరకు ఢిల్లీలో మంత్రి నివాసంలో ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు. కిషన్ రెడ్డిని కలిసిన వారిలో ఆటా అధ్యక్షులు భువనేష్ బుజాల , హరి లింగాల, రఘువీర్ రెడ్డి, స‌న్నీ రెడ్డి , జయంత్ చల్లా , హరి దామెర తదితరులు వున్నారు. ఈ సభలకు హాజరుకావాల్సిందిగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులను ఆటా ప్రతినిధులు ఇప్పటికే ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

ఇకపోతే... ఈసారి ఆటా సభలకు దాదాపు 15,000 మందికి పైగా హాజరవుతారని అంచనా. ఇందుకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. కరోనా మహమ్మారి కారణంగా గడిచిన రెండేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయారు. ప్రస్తుతం అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా వైరస్ అదుపులోకి రావడంతో ఈసారి తెలుగు మహాసభలను భారీఎత్తున నిర్వహించాలని ఆటా నిర్వాహక కమిటీ నిర్ణయించింది. సభల నిర్వహణకు సంబంధించి 65 కమిటీలను ఏర్పాటు చేశామని ఆటా ప్రెసిడెంట్‌ భువనేష్‌ బూజల మీడియాకు తెలిపారు. ఇందులో దాదాపు 350 మందిని సభ్యులుగా ఎన్నుకున్నట్లు తెలిపారు. వీరంతా మహాసభలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తారని భువనేష్ వెల్లడించారు.

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పద్మవిభూషణ్ జగ్గీ వాసుదేవ్ (సద్గురు) , ప్రముఖ కవులు, కళాకారులు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు విజయ్ దేవరకొండ , రకుల్ ప్రీత్ సింగ్ , గాయకుడు రాం మిరియాల ఆటా సభలకు హాజరుకానున్నారు. అలాగే దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా ఆధ్వర్యంలో సంగీత విభావరికి ఏర్పాట్లు చేస్తున్నారు.

More News

సైనికులు, రైతుల స్థాయి కార్మికులది .. పవన్ కల్యాణ్ ‘‘మే డే’’ శుభాకాంక్షలు

మే డేను పురస్కరించుకుని కార్మిక ప్రపంచానికి శుభాకాంక్షలు తెలిపారు జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్.

మద్యం మత్తులో టవరెక్కి.. అర్ధరాత్రిపూట పోలీసులకు చెమటలు పట్టించిన మందుబాబు

అమ్మానాన్న మందలించారనో , ప్రేమలో విఫలమయ్యారనో, భార్యాభర్తల మధ్య గొడవలనో.. ఇలా ఈ మధ్యకాలంలో చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలు ఎక్కువవుతున్నాయి.

ఆటా మహాసభలకు ఎర్రబెల్లికి ఆహ్వానం.. తప్పక వస్తానన్న మంత్రి

అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ 17వ మహాసభలు జూలై 1 నుంచి జూలై 3 తేదీ వరకు అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో జరగనున్నాయి.

జగన్‌ను కలిసిన ఆటా ప్రతినిధులు.. తెలుగు మహాసభలకు రావాలంటూ ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆటా (అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌) ప్రతినిధులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో

నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా 'ముత్తయ్య' టీజర్ విడుదల

జీవితంలో ఒక్క సినిమాలోనైనా నటించాలని కోరుకునే వ్యక్తి ముత్తయ్య. అతని కోరిక నెరవేరిందా లేదా అనే ఆసక్తిని కలిగిస్తూ సాగింది "ముత్తయ్య" సినిమా టీజర్.