close
Choose your channels

USA వర్జీనియా లో విజయవంతంగా జరిగిన "ఆటా" క్యారం బోర్డ్, టేబుల్ టెన్నిస్ పోటీలు

Tuesday, May 17, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వాషింగ్టన్ DCలో జూలై 1 నుండి జూలై 3 వరకు జరగనున్న ATA కన్వెన్షన్ మరియు యూత్ కాన్ఫరెన్స్ సందర్భంగా, 17వ ATA కన్వెన్షన్ టీమ్ మే 14 తేదీ లో వర్జీనియాలో "టేబుల్ టెన్నిస్" పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో DC, MD and VA రాష్ట్రాలకు చెందిన తెలుగు వారు చురుగ్గా పాల్గొన్నారు.

మే 14న హెండన్ సిటి లోని కాసెల్స్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో చాలా ఉత్సాహభరితంగా టేబుల్ టెన్నిస్ పోటీలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి 200 మందికి పైగా హాజరు కాగా 120 మంది పోటీల్లో పాల్గొన్నారు. మహిళల టేబుల్ టెన్నిస్ విభాగంలో సుష్మిత-కుసుమ డబుల్స్‌లో గెలుపొందగా, అజిత-స్వాతి ద్వితీయ స్థానంలో నిలిచారు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను మాధురి బుజలెమ్మ గెలుచుకోగా, సుస్మిత రన్నరప్‌గా నిలిచింది. పురుషుల విభాగంలో డివిజన్ 1 విజేత శరత్, రన్నరప్ రామకృష్ణ. డివిజన్ 2 విజేత వివేక్, 2వ స్థానం కిషోర్. విక్రమ్‌, చంద్ర డబుల్స్‌ టైటిల్స్‌ గెలుపొందగా, కిషోర్‌, మురళి రన్నరప్‌లుగా నిలిచారు. మిక్స్‌డ్‌ డబుల్‌ విభాగంలో అజిత, వివేక్‌అజిత, వివేక్‌ టైటిల్‌ గెలుచుకోగా, శ్రుతి, చంద్ర 2వ స్థానంలో నిలిచారు. సుధీర్ కోడం మరియు జట విష్నుబొట్ల "టేబుల్ టెన్నిస్" పోటీలకు న్యాయ నిర్నేతలుగ వ్యహరించటం జరిగింది.

ఈ కార్యక్రమాలను సుధీర్ దామిడి స్పోర్ట్స్ చైర్, శ్రీధర్ బండి స్పోర్ట్స్ కో-చైర్, శీతల్ బొబ్బా మహిళా స్పోర్ట్స్ చైర్ విజయవంతంగా నిర్వహించారు.

క్యాపిటల్‌ ఏరియా తెలుగు అసోసియేషన్‌ (CATS) ప్రెసిడెంట్‌ సతీష్‌ వడ్డి, Local Co-ordicator శ్రవణ్ పాడురు, మీడియా కమిటీ చైర్ రాము ముండ్రాతి మరియు కో చైర్‌ సునీల్ కుడికల ,హాస్పిటలిటి కమిటీ చైర్ అమర్ పాశ్య మరియు కో చైర్‌ , వాలంటీర్ కమిటీ చైర్ లోహిత్,సుధీర్ దామిడి స్పోర్ట్స్ చైర్, శ్రీధర్ బండి స్పోర్ట్స్ కో-చైర్, శీతల్ బొబ్బా మహిళా స్పోర్ట్స్ చైర్ టీమ్‌ విజేతలను అభినందించి బహుమతులు అందించారు.

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పద్మవిభూషణ్ జగ్గీ వాసుదేవ్ (సద్గురు) , "Daaji" కమలేష్ పటేల్ , ప్రముఖ కవులు, కళాకారులు, రాజకీయ ప్రముఖులు , సినీ ప్రముఖులు Balakrishna, 1983 WorldCup Team Captain కపిల్ దేవ్ & కీలక player sunil గవాస్కర్, సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ , "DJ Tillu" సిద్దు, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్, Singer మంగ్లి గాత్రం, బిగ్ బాస్ విన్నర్ VJ సన్ని,ప్రముఖ వ్యాపారవేత్త GMR Group అధినేత గ్రంధి మల్లికార్జున రావు, ప్రముఖ మహిళ వ్యాపారవేత్త Appollo Group ఉపాసన కొణిదెల మరియు MSNLabs అధినేత ప్రముఖ Dr MSN Reddy లాంటి ఎందరో మహామహులు విచ్చెస్తున్న ఈ వేడుక వాషింగ్టన్ డి సి నగరం నడిబొడ్డున అతి పెద్ద ప్రాంగణంలో Walter E. Washington Convention Center నందు వివిధ కార్యక్రమాలతో పాటు 7000 Sq Ft లో 200 పైగా బిజినెస్ ఎగ్జిబిట్ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు.

ఈ మూడు రోజులు వరుసగా జూలై 1 నుంచి 3 వరకు వీరి సంగీతం తో వీనుల విందు చేయబోతున్నారు.

"మొదటి రోజు" సృష్టిస్తున్న గాయకుడు రాం మిరియాల అండ్ బ్యాండ్, "రెండవ రోజు" Melody King ఎస్ఎస్ థమన్ మరియు "మూడవ రోజు" ప్రముఖ సంగీత దర్శకుడు "పద్మవిభూషణ్" ఇళయరాజా సంగీత విభావరి ఏర్పాటు చేస్తున్నారు.

క్యారం బోర్డ్ పోటీలు

ATA కన్వెన్షన్ టీమ్, USCA (యునైటెడ్ స్టేట్స్ క్యారమ్స్ అసోసియేషన్) మరియు CACA (క్యాపిటల్ ఏరియా క్యారమ్స్ అసోసియేషన్) సహాయంతో మే 15న హిల్టన్ గార్డెన్, ASHBURN లో క్యారమ్స్ పోటీలను నిర్వహించింది. ఈ పోటీల్లో ఛాంపియన్ విభాగంలో "ఆదిలాబాద్ నైట్స్" జట్టు టైటిల్ గెలుచుకోగా, చిత్తూరు పుష్ప జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఛాలెంజర్స్ డివిజన్‌లో గుంటూరు మిర్చీ జట్టు టైటిల్ గెలుపొందగా, తిరుపతి టైగర్స్ 2వ స్థానంలో నిలిచింది.

టైటిల్ గెలుచుకున్న"ఆదిలాబాద్ నైట్స్" జట్టు కెప్టెన్ మరియు క్యారం బోర్డ్ నిర్వహకులు రాజేంద్ర గొడుగు ఒకరే కావటం గమనర్హం.

ATA బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అండ్ కన్వెన్షన్ అడ్వైజరీ చైర్ జయంత్ చల్లా, మరియు కన్వెన్షన్ కోఆర్డినేటర్ రవి చల్లా ఈ కార్యక్రమానికి హాజరై విజేతలను అభినందించారు, ఈ క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ATA బృందం ప్రతి ఒక్కరు అదే ఉత్సాహంతో మిగిలిన క్రీడలు మరియు సమావేశాల వరకు వరుసలో ఉన్న కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. స్పోర్ట్స్ చైర్ సుధీర్ దామిడి ATA కన్వెన్షన్ మీడియా టీం కి మరియు అద్భుతమైన మద్దతునిచ్చిన వాలంటీర్లందరికీ ధన్యవాదాలు తెలిపారు. స్థానిక రెస్టారెంట్ "కంట్రీ ఓవెన్" ఈ రెండు క్రీడా ఈవెంట్‌ల కోసం ఆహారాన్ని స్పాన్సర్ చేసింది. Local Co-ordicator శ్రవణ్ పాడురు, మీడియా కమిటీ చైర్ రాము ముండ్రాతి మరియు కో చైర్‌ సునీల్ కుడికల ,హాస్పిటలిటి కమిటీ చైర్ అమర్ పాశ్య మరియు కో చైర్‌,సుధీర్ దామిడి స్పోర్ట్స్ చైర్, శ్రీధర్ బండి స్పోర్ట్స్ కో-చైర్, శీతల్ బొబ్బా మహిళా స్పోర్ట్స్ చైర్ టీమ్‌ విజేతలను అభినందించి బహుమతులు అందించారు
ఈ కార్యక్రమాలను సుధీర్ దామిడి స్పోర్ట్స్ చైర్, శ్రీధర్ బండి స్పోర్ట్స్ కో-చైర్, శీతల్ బొబ్బా మహిళా స్పోర్ట్స్ చైర్ విజయవంతంగా నిర్వహించారు.

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పద్మవిభూషణ్ జగ్గీ వాసుదేవ్ (సద్గురు) , "Daaji" కమలేష్ పటేల్ , ప్రముఖ కవులు, కళాకారులు, రాజకీయ ప్రముఖులు , సినీ ప్రముఖులు Balakrishna, 1983 WorldCup Team Captain కపిల్ దేవ్ & కీలక player sunil గవాస్కర్, సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ , "DJ Tillu" సిద్దు, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్, Singer మంగ్లి గాత్రం, బిగ్ బాస్ విన్నర్ VJ సన్ని,ప్రముఖ వ్యాపారవేత్త GMR Group అధినేత గ్రంధి మల్లికార్జున రావు, ప్రముఖ మహిళ వ్యాపారవేత్త Appollo Group ఉపాసన కొణిదెల మరియు MSNLabs అధినేత ప్రముఖ Dr MSN Reddy లాంటి ఎందరో మహామహులు విచ్చెస్తున్న ఈ వేడుక వాషింగ్టన్ డి సి నగరం నడిబొడ్డున అతి పెద్ద ప్రాంగణంలో Walter E. Washington Convention Center నందు వివిధ కార్యక్రమాలతో పాటు 7000 Sq Ft లో 200 పైగా బిజినెస్ ఎగ్జిబిట్ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు.

ఈ మూడు రోజులు వరుసగా జూలై 1 నుంచి 3 వరకు వీరి సంగీతం తో వీనుల విందు చేయబోతున్నారు.

"మొదటి రోజు" సృష్టిస్తున్న గాయకుడు రాం మిరియాల అండ్ బ్యాండ్, "రెండవ రోజు" Melody King ఎస్ఎస్ థమన్ మరియు "మూడవ రోజు" ప్రముఖ సంగీత దర్శకుడు "పద్మవిభూషణ్" ఇళయరాజా సంగీత విభావరి ఏర్పాటు చేస్తున్నారు.

ఆటా 17వ మహాసభలు వివరాలకు https://www.ataconference.org సంప్రదించగలరు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.