close
Choose your channels

ఏపీలో కోట్లల్లో స్కామ్.. అచ్చెన్న మెడకు ఉచ్చు!?

Friday, February 21, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీలో కోట్లల్లో స్కామ్.. అచ్చెన్న మెడకు ఉచ్చు!?

ఆంధ్రప్రదేశ్‌లో భారీ స్కామ్ వెలుగుచూసింది. ఈ స్కామ్‌లో టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు ఈ కుంభకోణంలో ఉన్నారని వార్తలు గుప్పుమన్నాయ్. దీంతో వెంటనే ఆయన స్పందించి.. క్లారిటీ ఇచ్చుకున్నాడు. అంతేకాదు ఈ స్కామ్‌లో తాను తప్పుచేసినట్లు నిరూపిస్తే ఏ చర్యలకైనా సిద్ధమేనని ఆయన ప్రకటించారు. ఇంతకీ ఆ భారీ కుంభకోణం ఏంటి..? ఇదెలా జరిగింది..? అనేది ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

ఇప్పటికే తెలంగాణలో..!
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా రివర్స్ టెండరింగ్ వెళ్తూ.. మరోవైపు అవినీతికి పాల్పడిన గత ప్రభుత్వాన్ని జనం ముందు నిలబెడతానని ఒకటికి పదిసార్లంటే చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో తెలంగాణలో ఈఎస్‌ఐ పాటు దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అప్పట్లో డైరెక్టర్‌గా వ్యవహరించిన దేవికారాణి ఇప్పటికీ ఇంకా విచారణలోనే ఉంది. రోజురోజుకూ కొత్త విషయాులు విచారణలో వెలుగు చూస్తున్నాయ్. అంతేకాదు.. రూ.200 కోట్ల స్కాంకు పాల్పడ్డ ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడి కోట్ల రూపాయల ప్రభుత్వ నిధుల్ని పక్కదారి పట్టించినట్లు ఏసీబీ గుర్తించింది.

ఏపీలో పరిస్థితి ఇదీ..!
ఆంధ్రప్రదేశ్‌ ఈఎస్ఐలోనూ భారీ స్కామ్ బయటపడింది. గడిచిన ఆరేళ్లలో అనగా టీడీపీ హయాంలో జరిగిన ఈ భారీ కుంభకోణాన్ని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ బయటపెట్టింది. లేని కంపెనీల నుంచి నకిలీ కొటేషన్లు తీసుకుని ఆర్డర్లు చేసి స్కామ్‌కు పాల్పడ్డారిని అధికారులు చెబుతున్నారు. రూ.51 కోట్లు ఈఎస్‌ఐ డైరెక్టర్లు చెల్లించారని.. ఇందుకు డైరెక్టర్లు అయిన రవికుమార్‌, రమేష్‌, విజయ బాధ్యులని కూడా గుర్తించారు. మందులు, పరికరాలను వాస్తవ ధరకంటే 136 శాతం అధికంగా టెండర్లలో సంస్థలు చూపించాయి. అంతేకాదు.. ఎవరెవరికి..? ఏ సంస్థలకు అనేది కూడా విజిలెన్స్ అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది.

అచ్చెన్న పాత్ర ఉందా!?
ఈ కుంభకోణంలో మాజీమంత్రి అచ్చెన్నాయుడు పాత్ర ఉందనే వార్తలు ఊపందుకున్నాయి. అచ్చెన్న పాత్ర ఉందని.. నామినేషన్ పద్ధతిలో ఆయన టెండర్లు ఇప్పించారని రిపోర్ట్‌లో ప్రస్తావించడం జరిగింది. టెలీ హెల్త్ సర్వీసుల పేరుతో ఆర్డర్స్ ఇవ్వడంలో అచ్చెన్నాయుడు ఒత్తిడి తెచ్చారని.. నామినేషన్ల పద్ధతిలో కేటాయించాలని ఆదేశించారని రిపోర్ట్‌లోని విషయాలు వెలుగుచూశాయి. ఈ రిపోర్టుతో వైసీపీ నేతల్లో ఫుల్ జోష్ వచ్చింది. ఎందుకంటే ప్రస్తుతం టీడీపీలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు తర్వాత వాయిస్ ఉన్న నేత అచ్చెన్న మాత్రమే.. ఈ కుంభకోణంతో ఆయన మెడకు ఉచ్చు చుట్టుకుంటుందని.. దీంతో ఆయనకు చెక్ పెట్టొచ్చని అధికార పార్టీ భావిస్తోందట.

నేను రెఢీ!
ఈ స్కామ్ వ్యవహారంపై మాజీ మంత్రి అచ్చెన్న ఓ ప్రకటనలో స్పందించారు. ‘ప్రధాని ఆదేశాల ప్రకారమే పనులు నిర్వహించాం. నామినేషన్‌పై వర్క్‌ ఆర్డర్ల ఇవ్వడంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. ‌తెలంగాణలో ఎలా అమలు చేశారో.. ఏపీలో కూడా అలాగే అమలు చేశాం. నేను రాసిన అధికారులకు ఇచ్చిన ఆదేశాల్లోనూ అదే విషయం ఉంది. కొందరు కావాలనే పనిగట్టుకుని మరీ నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎలాంటి విచారణకైనా నేను సిద్ధం. అవినీతికి నేను ఎప్పుడూ దూరమే.. రికార్డులు నిశితంగా పరిశీలించి చర్యలు తీసుకోవచ్చు’ అని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు.

మరి ఈ వ్యవహారంలో విజిలెన్స్ అధికారులు ఏం చేయబోతున్నారా..? నిజంగానే అచ్చెన్నకు ఈఎస్ఐ స్కామ్ ఉచ్చు చిక్కుకోనుందా అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అదే అక్షరాలా నిజమనిపిస్తోంది. మరి ఈ వ్యవహారం ఎంతవరకూ వెళ్తుందో..? చివరికి ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.