షారూక్‌తో అట్లీ క‌న్‌ప‌ర్మ్‌?

  • IndiaGlitz, [Tuesday,October 15 2019]

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్స్ ఖాన్ త‌య్రంలో ఒక‌రైన షారూక్‌ఖాన్‌.. త్వ‌ర‌లోనే ఓ సౌతిండియ‌న్ డైరెక్ట‌ర్‌తో మూవీ చేయ‌బోతున్నాడు. ఇంత‌కు ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు.. అట్లీ. ఇప్ప‌టి వర‌కు నాలుగు సినిమాలను మాత్ర‌మే అట్లీ డైరెక్ట్ చేశాడు. అందులో మూడు చిత్రాలు మాత్ర‌మే విడుద‌లైయ్యాయి. మూడు బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలే.

కాగా.. నాలుగో చిత్రం కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్‌తో తెర‌కెక్కించిన 'బిగిల్‌' ఈ దీపావళికి విడుద‌ల‌వుతుంది. ఇప్పుడు ఐదో చిత్రానికి అట్లీ బాలీవుడ్ డైరెక్ట‌ర్‌గా మారిపోతున్నాడు. నిజానికి బిగిల్ సినిమా షూటింగ్ స‌మ‌యంలో అట్లీని షారూక్ క‌లిసి క‌థ విన్నాడు. క‌థ న‌చ్చ‌డంతో షారూక్ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. వీరి చ‌ర్చ‌ల‌ను చూసిన‌వారు షారూక్‌ఖాన్ 'బిగిల్‌' చిత్రంలో విల‌న్‌గా న‌టిస్తున్నాడన్నారు. కానీ షారూక్‌, అట్లీ కాంబినేష‌న్‌లో సినిమాకు జ‌రిగిన చ‌ర్చ‌ల‌నీ ఇప్పుడు ఓ క్లారిటీ వ‌చ్చాయి. డిసెంబ‌ర్ నుండి ఈ సినిమాకు సంబంధించిన పనులు స్టార్ట్ అవుతాయట‌. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమాను అట్లీ తెర‌కెక్కిస్తాడ‌ని కోలీవుడ్ వ‌ర్గాలంటున్నాయి.

తొలి చిత్రం రాజారాణితో సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించి అంద‌రి దృష్టిని ఆకర్షించాడు అట్లీ. ఆ త‌ర్వాత కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్‌తో తెరి(పోలీస్‌),మెర్స‌ల్‌(అదిరింది) సినిమాల‌ను తెర‌కెక్కించాడు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలుగా నిలిచాయి. దీంతో హీరో విజ‌య్ వెంట‌నే అట్లీకి హ్యాట్రిక్ మూవీ చేసే అవ‌కాశ‌మిచ్చాడు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో విజ‌య్‌, అట్లీ కాంబినేష‌న్‌లో బిగిల్‌(విజిల్‌) సినిమా తెర‌కెక్కింది.

More News

సంక్రాంతి బరిలో వెంకీ మామ?

నిజ జీవితంలో మామా అల్లుడు అయిన వెంక‌టేష్‌, నాగ‌చైత‌న్య అక్కినేని క‌లిసి న‌టిస్తోన్న తాజా చిత్రం `వెంకీమామ‌`.

కోలీవుడ్‌లో క్రికెట‌ర్స్‌

ఇప్పుడు ఇండియ‌న్ క్రికెట‌ర్స్ అంద‌రూ కోలీవుడ్‌లో న‌టిస్తున్నారు. వీరు న‌టించ‌బోయే సినిమాల‌న్నీ అధికారికంగా క‌న్‌ఫ‌ర్మ్ అయ్యాయి.

మ‌రోసారి అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్న నిర్మాత‌

నిర్మాత కె.కె.రాధామోహ‌న్ ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్‌ను నిర్మించినా ఈయ‌న‌కు ల‌క్ క‌లిసి రావ‌డం లేదు.

రీమేక్స్‌పై మ‌న‌సుప‌డుతున్న రామ్‌

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఈ ఏడాది `ఇస్మార్ట్ శంక‌ర్‌`తో చాలా పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

బీసీసీఐ గంగూలీకి సీఎం దీదీ అభినందనలు!

బీసీసీఐ అధ్యక్ష పదవికి టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ నామినేషన్‌ వేసిన సంగతి తెలిసిందే.