close
Choose your channels

షారూక్‌తో అట్లీ క‌న్‌ప‌ర్మ్‌?

Tuesday, October 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

షారూక్‌తో అట్లీ క‌న్‌ప‌ర్మ్‌?

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్స్ ఖాన్ త‌య్రంలో ఒక‌రైన షారూక్‌ఖాన్‌.. త్వ‌ర‌లోనే ఓ సౌతిండియ‌న్ డైరెక్ట‌ర్‌తో మూవీ చేయ‌బోతున్నాడు. ఇంత‌కు ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు.. అట్లీ. ఇప్ప‌టి వర‌కు నాలుగు సినిమాలను మాత్ర‌మే అట్లీ డైరెక్ట్ చేశాడు. అందులో మూడు చిత్రాలు మాత్ర‌మే విడుద‌లైయ్యాయి. మూడు బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలే.

కాగా.. నాలుగో చిత్రం కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్‌తో తెర‌కెక్కించిన `బిగిల్‌` ఈ దీపావళికి విడుద‌ల‌వుతుంది. ఇప్పుడు ఐదో చిత్రానికి అట్లీ బాలీవుడ్ డైరెక్ట‌ర్‌గా మారిపోతున్నాడు. నిజానికి బిగిల్ సినిమా షూటింగ్ స‌మ‌యంలో అట్లీని షారూక్ క‌లిసి క‌థ విన్నాడు. క‌థ న‌చ్చ‌డంతో షారూక్ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. వీరి చ‌ర్చ‌ల‌ను చూసిన‌వారు షారూక్‌ఖాన్ `బిగిల్‌` చిత్రంలో విల‌న్‌గా న‌టిస్తున్నాడన్నారు. కానీ షారూక్‌, అట్లీ కాంబినేష‌న్‌లో సినిమాకు జ‌రిగిన చ‌ర్చ‌ల‌నీ ఇప్పుడు ఓ క్లారిటీ వ‌చ్చాయి. డిసెంబ‌ర్ నుండి ఈ సినిమాకు సంబంధించిన పనులు స్టార్ట్ అవుతాయట‌. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమాను అట్లీ తెర‌కెక్కిస్తాడ‌ని కోలీవుడ్ వ‌ర్గాలంటున్నాయి.

తొలి చిత్రం రాజారాణితో సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించి అంద‌రి దృష్టిని ఆకర్షించాడు అట్లీ. ఆ త‌ర్వాత కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్‌తో తెరి(పోలీస్‌),మెర్స‌ల్‌(అదిరింది) సినిమాల‌ను తెర‌కెక్కించాడు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలుగా నిలిచాయి. దీంతో హీరో విజ‌య్ వెంట‌నే అట్లీకి హ్యాట్రిక్ మూవీ చేసే అవ‌కాశ‌మిచ్చాడు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో విజ‌య్‌, అట్లీ కాంబినేష‌న్‌లో బిగిల్‌(విజిల్‌) సినిమా తెర‌కెక్కింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.