అల్లువారింట అట్లతద్ది!

  • IndiaGlitz, [Sunday,October 28 2018]

తెలుగులో స్టయిలిష్ స్టార్ ఎవరు? అని అడిగితే ఎవరైనా అల్లు అర్జున్ పేరే చెబుతారు! స్టయిల్‌కి అల్లు అర్జున్ కేరాఫ్ అడ్రస్ అన్నట్టు ఉంటారు. అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి కూడా ఎప్పుడూ స్ట‌యిల్‌గా కనిపిస్తారు.

స్ట‌యిల్‌తో పాటు సాంప్రదాయాలనూ పాటిస్తారని ఈ రోజు అల్లు స్నేహారెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌ చూస్తే ఎవరైనా చెబుతారు. శనివారం అట్లతద్ది సందర్భంగా ఇంట్లో పూజలు చేశారు స్నేహారెడ్డి.

ఈ సందర్భంగా భర్తతో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సాంప్రదాయ దుస్తుల్లో, చూడముచ్చటి నగలతో నెటిజన్లను ఆమె విశేషంగా ఆకర్షించారు. రెండు రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన హాలోవీన్ పార్టీలో ఇందుకు భిన్నంగా ట్రెండీ దుస్తుల్లో స్నేహారెడ్డి ఆకట్టుకున్నారు.

సినిమా సినిమాకు తన స్టయిల్ విషయంలో అల్లు అర్జున్ ఎంత వ్యత్యాసం చూపించారో.. స్నేహారెడ్డి కూడా సందర్భానుసారం అంతే వ్యత్యాసం చూపిస్తున్నారని నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

More News

విజయ్ దేవరకొండకు హిందీ హీరో కాంప్లిమెంట్‌!

'అర్జున్‌రెడ్డి' అంటే విజయ్ దేవరకొండ... విజయ్ దేవరకొండ అంటే 'అర్జున్‌రెడ్డి' అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

చంద్రోదయం చిత్రీకరణ పూర్తి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బయోపిక్ గా తెరకెక్కుతొన్న చిత్రం 'చంద్రోదయం'. ఈ బయోపిక్ ను పి.వెంకటరమణ దర్శకత్వంలొ జి.జె.రాజేంద్ర నిర్మిస్తున్నారు.

టెంపర్‌ రీమేక్‌ చేయడానికి కారణమదే: విశాల్‌

'పందెంకోడి' చిత్రంతో తమిళ్‌, తెలుగు ప్రేక్షకుల్లో మాస్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశాల్‌ నటించిన లేటెస్ట్‌ చిత్రం 'పందెంకోడి-2'.

ప్ర‌జ‌ల త‌ర‌పున రాజకీయ అస్ర్తం ఆప‌రేష‌న్ 2019

అలివేల‌మ్మ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్పించు  టి. అలివేలు నిర్మించిన క‌ర‌ణం బాబ్జీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ఆప‌రేష‌న్ 2019. శ్రీ‌కాంత్‌, మంచుమ‌నోజ్ న‌టిస్తున్న ఈ చిత్రం న‌వంబ‌ర్ 9న

ట్రూ సక్సెస్ దిశగా 'టు ఫ్రెండ్స్' 

అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వంటి పలు రంగాల్లో అద్భుతాలు ఆవిష్కరించి, రాయలసీమ ముద్దు బిడ్డగా, అనంతపురం ఆణిముత్యంగా అభివర్ణించబడే బహుముఖ ప్రజ్ఞాశాలి